టాయిలెట్ కోసం వందేభారత్‌లో ఎక్కి ఇరుక్కున్నాడు.. చివరకు
ఓ వ్యక్తి వందేభారత్ రైల్లో టాయిలెట్ కోసం ఎక్కి ఇరుక్కుపోయాడు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 7:08 PM ISTటాయిలెట్ కోసం వందేభారత్‌లో ఎక్కి ఇరుక్కున్నాడు.. చివరకు
గతంలో ఓ వ్యక్తి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం అయ్యిన సందర్భంగా రైల్‌లో ఎక్కాడు. ఉత్సాహంతో సెల్ఫీ దిగాలని ఎక్కి ఫొటోలు తీసుకున్నాడు. కానీ డోర్లు ఆటోమెటిక్‌గా క్లోజ్ అవుతాయనే విషయం తెలియక ఇరుక్కుపోయాడు. తాను దిగిపోవాలని రైల్ ఆపాలని కోరాడు. కానీ అది కుదరదని అధికారులె చెప్పడంతో.. చేసేందేం లేక వ్యక్తి రైల్లోని ఉన్నాడు. ఆ తర్వాత ఫైన్ కూడా చెల్లించుకున్నాడు. తాజాగా మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈసారి ఓ వ్యక్తి వందేభారత్ రైల్లో టాయిలెట్ కోసం ఎక్కి ఇరుక్కుపోయాడు.
మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో సహా హైదరాబాద్ నుంచి భోపాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. భోపాల్ నుంచి సింగ్రౌలీ వెల్లేందుకు మరో రైలు కోసం ప్లాట్‌ఫామ్‌పై వేచి చూస్తున్నాడు. అదే సమయంలో మూత్ర విసర్జన వెళ్లాలని అనుకున్నాడు. అయితే.. అప్పుడే ప్లాట్‌ఫామ్‌పై వచ్చి ఆగిన వందేభారత్ రైల్‌లోకి ఎక్కాడు. టాయిలెట్‌లోకి వెళ్లి పని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే డోర్స్ క్లోజ్ అయ్యాయి. దిగేందుకు వీలు లేకుండా పోయింది. చూస్తుండగానే ట్రైన్ కూడా కదిలిపోయింది. తర్వాత టీటీని సంప్రదించాడు. జరిగిందంతా చెప్పాడు. ట్రైన్ ఆపాలని కోరాడు. కానీ టీటీ అది కుదరదని చెప్పడంతో.. చేసేదేం లేక ట్రైన్‌లోనే ఉన్నాడు.
వందేభారత్ ట్రైన్ ఉజ్జయిని స్టేషన్‌లో ఆగుతుందని చెప్పడంతో స్టేషన్ వచ్చే వరకు వెయిట్ చేశాడు. ఇక టికెట్ లేకుండా ట్రైన్‌లోకి ఎక్కినందుకు టీటీ రూ.1,020 ఫైన్ విధించాడు. జస్ట్ టాయిలెట్ కోసం ఎక్కి ఎరక్కపోయి ఇరుక్కుని వెయ్యి రూపాయల ఫైన్ కట్టాడు.
ఇక అతని కుటుంబం భోపాల్ స్టేషన్‌లోనే ఉండిపోయింది. ఆ తర్వాత ఉజ్జయిని నుంచి బస్ టికెట్ రూ.750 చెల్లించి భోపాల్ చేరుకున్నాడు. ఇక వారు సింగ్రౌలీ వెళ్లేందుకు రూ.4వేలు చెల్లించి టికెట్లు బుక్ చేసుకున్న ట్రైన్ కూడా వెళ్లిపోయింది. దాంతో.. మొత్తంగా సదురు వ్యక్తి రూ.6వేలు నష్టపోయినట్లు తెలిపాడు. ఈ ఘటనపై భోపాల్ రైల్వే స్టేషన్ అదికారులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.