డ్రీమ్11 ద్వారా మిలియనీర్ అయిన ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కూడా డ్రీమ్11 ద్వారా మిలయనీర్ అయ్యాడు. కానీ... చివరకు అధికారుల చేతిలో సస్పెన్షన్‌కు గరయ్యాడు.
By Srikanth Gundamalla Published on 19 Oct 2023 3:58 PM ISTడ్రీమ్11 ద్వారా మిలియనీర్ అయిన ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
ఆన్‌లైన్ గేమింగ్ డ్రీమ్11 ద్వారా చాలా మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినవారు ఉన్నారు. గతంలో ఇలా అదృష్టాన్ని పరీక్షించుకున్నవారిని చాలా మందిని చూశాం. తాజాగా ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కూడా డ్రీమ్11 ద్వారా మిలయనీర్ అయ్యాడు. కానీ... చివరకు అధికారుల చేతిలో సస్పెన్షన్‌కు గరయ్యాడు.
ఆన్‌లైన్ గేమ్ డ్రీమ్11లో పుణెకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ సోమనాథ్ ఝండే రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. అయితే.. అతను డ్రీమ్11 ద్వారా కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడన్న వార్త స్థానికంగా వైరల్ అయ్యింది. దాంతో.. చాలా మంది సబ్‌ఇన్‌స్పెక్టర్ ఇంటర్వ్యూలను తీసుకునేందకు ప్రయత్నించారు కూడా. అయితే.. పోలీసు శాఖ నుండి ఈ ఘటనను ప్రాంప్ట్ చేసింది. అతని ప్రవర్తనతో పాటు నోటి మాటలపై పింప్రి-చించ్వాడ్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించారు.
ఝండే అనుమతి లేకుండా ఆన్‌లైన్ గేమ్ ఆడాడని, పోలీసు యూనిఫాం ధరించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడని విచారణలో తేలింది. ఈ విచారణ అనంతరం నివేదిక అందిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు. సోమనాథ్ ఝండేను విధుల నుంచి సస్పెండ్ చేశారు. విచారణకు నాయకత్వం వహించిన డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్వప్న గోర్ మాట్లాడుతూ.. "విచారణ తర్వాత, అతను అనుమతి లేకుండా డ్రీమ్11 గేమ్ ఆడినట్లు తేలింది. ఇది అతని సస్పెన్షన్‌కు దారితీసింది. ఇతర పోలీసు సిబ్బంది ఇలాంటివి చేయకుండా ఈ సంఘటన రిమైండర్‌గా ఉపయోగపడుతుంది. అదే పద్ధతిలో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటం వలన, వారు కూడా క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది." అని చెప్పారు.