కొత్తిమీరపై పిటిషన్

By -  Nellutla Kavitha |  Published on  12 March 2022 8:50 PM IST
కొత్తిమీరపై పిటిషన్

ఏదైనా అంశం క్షణాల్లో ట్రెండ్ అవ్వాలన్నా, అంతే వేగంగా వైరల్ కావాలన్నా సోషల్ మీడియాని మించిన సాధనం లేదు. హాష్ టాగ్ తో పిటిషన్లు వేసినట్లే, ఛాలెంజ్ లు విసిరి అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. Instagram, twitter, ఫేస్బుక్ ఇప్పుడు పిటిషన్లకు వేదికలు అవుతున్నాయి. సరికొత్తగా కొత్తిమీరను భారతదేశ జాతీయ మూలికగా గుర్తించాలని పిటిషన్ ను ప్రారంభించారు. అది ట్రెండ్ అవుతోంది. పిటిషన్ ను ఇండియన్ ఫెఫ్ రణవీర్ బ్రార్ ప్రారంభించారు. కొత్తిమీర లేకుండా భారత్ లో దాదాపుగా ఏ వంటకము పూర్తి కాదు, అంత విస్తృత వినియోగం ఉన్న వేరే ఏ మూలిక లేదంటారు రణవీర్. ఆయన నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు సంఖ్య 50 లక్షల పైమాటే. ఇక ఆయనకు ఇంస్టాగ్రామ్, ట్విట్టర్లలో దాదాపుగా 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫేస్బుక్ లో 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ప్రముఖుడు. బోస్టన్లో రెండు రెస్టారెంట్లు నిర్వహిస్తున్న రణబీర్ కు భారత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మాంసాహార, శాకాహార వంటలతో పాటుగా సూపులు, ఇతర మసాలా దినుసులతో ధనియాలను వాడడం అందరూ చేస్తుంటారని రణవీర్ చెబుతున్నారు. ఏ ఇతర మసాలా దినుసులు ఇంత విరివిగా వాడం కాబట్టి కొత్తిమీరకు జాతీయ మూలికగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ పోస్ట్ చేశారు. "పిటిషన్ టు మేక్ ధనియా ద నేషనల్ హర్బ్"అంటూ ఆయన ఆ పోస్టులో ప్రతిపాదించారు. రణవీర్ పెట్టిన ఈ పోస్టు పై అప్పుడే నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రుచి కోసమే కాకుండా ఆరోగ్యపరంగాను కూడా కలిగే ప్రయోజనాల రీత్యా కూడా కొత్తిమీర వాడకం పెరుగుతోందంటారు రణవీర్, అందుకే దాన్ని సూపర్ ఫుడ్ గా అభివర్ణించారు. డయాబెటిస్ ను అదుపులో ఉంచడం తో పాటుగా, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కొత్తిమీర తోడ్పడుతుందని రణవీర్ పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయుల లాగానే కొత్తిమీర లేకుండా తనకు ఏ వంట పూర్తి కాదని, కూరగాయలు పప్పులతో చేసే వంటకాలు లోనే కాదు అన్ని రకాల వంటల్లో కొత్తిమీరను అందరం ఉపయోగిస్తాం అని అంటున్నారు రణవీర్. change.org లో గురువారం ఆయన పిటిషన్ ను ప్రారంభించారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీనీ అడ్రస్ చేస్తూ ప్రారంభించిన ఈ పిటిషన్ పై అప్పుడే సంతకాల సేకరణ కూడా మొదలైంది. మరి ఈ పిటిషన్ పై మీరెలా స్పందిస్తారు, మీ కామెంట్స్ ఏంటి? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Next Story