వేల కోట్ల ఆస్తిని వదిలి..ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతి

వేల కోట్ల ఆస్తులను వదులుకుని ప్రియుడిని పెళ్లాడింది. ప్రస్తుతం సాదాసీదా జీవితాన్నే గడుపుతోంది.

By Srikanth Gundamalla  Published on  15 Aug 2023 6:21 AM GMT
Malaysian woman, leave 2000 crore,  love marriage,

 వేల కోట్ల ఆస్తిని వదిలి..ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతి

ప్రేమ పేరుతో టైమ్‌ పాస్‌ చేస్తూ.. మోసాలు చేస్తున్న ఈ కాలంలో ఓ యువతి వేల కోట్ల ఆస్తిని వదులుకుంది. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ యువతి.. సాదాసీదా యువకుడిని ఇష్టపడింది. అతడినే పెళ్లాడాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రులు అందుకు నిరకారించినా.. ఆమె ప్రేమ నిజమైనది కావడంతో అతన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదు. పెంచినవారిని కూడా కాదని.. వేల కోట్ల ఆస్తులను వదులుకుని ప్రియుడిని పెళ్లాడింది. ప్రస్తుతం సాదాసీదా జీవితాన్నే గడుపుతోంది.

మలేసియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఖూ కేపెంగ్‌, మాజీ మిస్‌ మలేసియా పాలైన్‌ ఛాయ్‌ దంపతులకు ఏంజెలినా ఫ్రాన్సిస్‌ అనే కుమార్తె ఉంది. ఆమె ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో జెడియా అనే యువకుడు పరిచయం అయ్యాడు. పరిచయం ప్రేమగా మారింది. జీవితాంతం కలిసే బతకాలని నిర్ణయించుకున్నాడు. వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల సభ్యులకు తెలిపారు. సంపన్నులు కావడంతో తమ కూతురిని జెడియాకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఖూ కేపెంగ్‌ నిరాకరించారు. ఆర్థికంగా ఇరు కుటుంబాల మధ్య భారీగా తేడా ఉందనే విషయాన్ని చెప్పారు. అతడికి దూరంగా ఉండాలని.. లేదంటే వారసత్వంగా వచ్చే ఆస్తిని ఇవ్వబోమని చెప్పారు. చివరకు ప్రియుడుతోనే ఉండాలని నిశ్చయించుకుంది ఏంజెలినా ఫ్రాన్సిస్.

ఆ తర్వాత కుటుంబ సభ్యులను వదిలేసి.. వారసత్వంగా వచ్చే ఆస్తిని కాదనుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. 2008లోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే.. ఏంజెలినా ఫ్రాన్సిస్‌ వారసత్వంగా వచ్చే ఆస్తి రూ.2వేల కోట్లను వదులుకున్నట్లు తెలిసింది. కాగా.. ప్రేమ వివాహం చేసుకున్నాక ఇద్దరూ తమతమ కుటుంబాలకు దూరంగానే ఉన్నారు. చాలారోజుల తర్వాత ఇటీవల ఫాన్సిస్‌ ఆమె తల్లిదండ్రులను కలవాల్సి వచ్చింది. ఫ్రాన్సిస్‌ తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటుడంతో.. ఆమె కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇచ్చింది. ఈ క్రమంలో తల్లి గురించి గొప్పగా వివరించింది. కుటుంబం కోసం తన తల్లి చేసిన సేవలను ఎంతో కొనియాడింది. తండ్రిపై మాత్రం విమర్శలు గుప్పించింది ఫ్రాన్సిస్. ఈ సందర్భంగా తన ప్రేమ కథ చెప్పింది. తన తల్లిదండ్రులు ఎప్పటికైనా కలవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. కాగా.. ప్రస్తుతం ఫ్రాన్సిస్‌ లవ్‌ స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story