పెద్ద ప్రమాదం.. జస్ట్ మిస్ అయ్యింది

Hammock Swinging Goes Horribly Wrong as Friends Escape Near Death Experience.ఊయల ఊగడం అన్నది

By M.S.R  Published on  2 Jan 2022 8:15 AM GMT
పెద్ద ప్రమాదం.. జస్ట్ మిస్ అయ్యింది

ఊయల ఊగడం అన్నది ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన అంశం. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకూ ఇష్టపడుతూ ఉంటారు. ఇక ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఊయలలు కనిపిస్తూ ఉంటాయి. కొండ అంచులలో కూడా ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటారు. అలాంటి ఓ ఊయలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఊయలంటే చాలా ఇష్టం కాబట్టి తమ ఇంట్లో ఊయలని ఉంచుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వృద్ధులు కూడా ఊయలని ఆస్వాదించడం వంటి అనేక వీడియోలను మనం చూస్తూనే ఉంటాము. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఎంత డేంజరో తెలియజేస్తుంది. ఇద్దరు స్నేహితులు ఊయల ఊగుతూ ప్రమాదకరమైన ప్రదేశానికి చేరుకున్న వీడియో చూసిన తర్వాత, ఉయ్యాల కోసం అలాంటి స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారని మీరు ఆశ్చర్యపోతారు. ఊయల ఊపుతూ ఒక యువకుడు ప్రాణాలతో బయటపడటం మీరు చూస్తారు. ఇద్దరు స్నేహితులు పర్వత ప్రాంతంలో ఊయల కోసం వెళ్లినట్లు వీడియోలో చూడవచ్చు.

ఈ సమయంలో ఒక స్నేహితుడు మరో స్నేహితుడిని గట్టిగా ఊపుతున్నాడు. అప్పుడు ఊయల ఊపుతున్న యువకుడు ఒక్కసారిగా పడిపోయాడు. ఊయల లోతైన లోయ అంచున ఉంచబడింది. ఊయల ఊపుతున్న మిత్రుడు ఆ ఊయలని ముందుకు తోస్తాడు. ఇంతలో అతని పాదం ఇరుక్కుపోయింది. ఆ ఊయాలలో కాలు ఇరుక్కోవడంతో ఆ యువకుడు కాస్తా లోయలో పడకుండా కొనాన నిలిచిపోవడం వీడియోలో చూడొచ్చు. అదృష్టవశాత్తూ యువకుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ షాకింగ్ వీడియో సోషల్స్టార్ఆఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా వ్యూస్ ను పొందింది.

Next Story