డెలివరీ బాయ్స్‌ కోసం 'రిలాక్స్‌ స్టేషన్' పెట్టిన యువకుడు

డెలివరీ బాయ్స్ కష్టాన్ని గుర్తించిన ఓ యువకుడు వారి కోసం రిలాక్స్ స్టేషన్‌ పెట్టాడు.

By Srikanth Gundamalla  Published on  14 July 2023 2:36 PM IST
Delivery Boys, Relax Station, Mumbai, Viral,

డెలివరీ బాయ్స్‌ కోసం 'రిలాక్స్‌ స్టేషన్' పెట్టిన యువకుడు

కొన్నాళ్ల నుంచి చాలా మంది హోటళ్లకు వెళ్లి తినడమే మానేశారు. ఎందుకంటే డెలివరీ యాప్స్‌ వచ్చేశాయి. కొంత అమౌంట్‌ పే చేస్తే చాలు.. డోర్‌ డెలివరీ చేసేస్తారు. రోజురోజుకు ఆన్‌లైన్‌ డెలివరీ పెరిగిపోతుంది. డెలివరీ బాయ్స్‌ కూడా ఎండ, వాన.. పగలు, రాత్రి ఇలా ఏమీ లెక్క చేయకుండా పొట్టకూటి కోసం పనిచేస్తున్నారు. అవతలివారి ఆకలిని తీరుస్తున్నారు. అయితే.. డెలివరీ బాయ్స్‌ కష్టాలకు సంబంధించిన వీడియోలను ఇప్పటికే మనం చాలా చూశాం. వర్షం నీటిలో తడుస్తూ.. ఎండలో వేసవి తాపానికి నీళ్లు తాగుతూ కనిపించిన ఫోటోలు, వీడియోలు మనసులను కదలించాయి. డెలివరీ బాయ్స్ కష్టాన్ని గుర్తించిన ఓ యువకుడు వారి రిలాక్సేషన్ గురించి ఆలోచించాడు. డెలివరీ బాయ్స్‌ కోసం రిలాక్స్ స్టేషన్‌ పెట్టాడు.

ముంబైకి చెందిన సిద్దేశ్‌ అనే యువకుడు డెలివరీ బాయ్స్‌ కోసం వినూత్న ఆలోచన చేశాడు. అసలే ఇది వానాకాలం వాతావరణ పరిస్థితులు అనుకూలించకున్నా సమయానికి ఫుడ్‌తో పాటు వస్తువులను డెలివరీ చేసే బాయ్స్‌ కోసం అతను రిలాక్స్ స్టేషన్‌ ప్రారంభించాడు. కస్టమర్స్‌ ఆర్డర్లను వారికి చేరేలా నిరంతయారంగా పని చేస్తున్నవారికి టీ, కాఫీ, సమోసా, నీళ్లు ఇలాంటివి అందిస్తూ కాస్త ఉత్సాహాన్ని నింపుతున్నాడు. తాను ఇండియాలోని నిజమైన హీరోల రిలాక్స్‌ స్టేషన్‌ను స్థాపించానని ఈ సందర్భంగా సిద్దేశ్‌ అన్నాడు. తినడానికి, తాగడానికి డ్రింక్స్‌ ఇవ్వడమే కాదు.. డెలివరీ బాయ్స్‌కు అవసరమైన వారికి రెయిన్‌ కోట్‌ కూడా అందిస్తున్నాడు. అయితే.. అవన్నీ ఫ్రీగానే అందిస్తున్నాడు సిద్దేశ్. రిలాక్స్‌ స్టేషన్‌కు సంబంధించిన వీడియోను యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

సదురు యువకుడి ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు. డెలివరీ బాయ్స్ కష్టాలను గుర్తించి వారికి చేస్తున్న సేవ అద్భుతమని పొగుడతున్నారు. అంతేకాదు సిద్దేశ్ అందరికీగా ఆదర్శంగా నిలిచాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. తాము కూడా సాయం చేస్తామంటూ స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. సిద్దేశ్‌ ముంబైలో డెలివరీ బాయ్స్‌ కోసం రిలాక్స్‌ స్టేషన్‌ను రెండు చోట్లలో ఉంచినట్లు తెలుస్తోంది.

Next Story