పెళ్లి అయ్యింది.. అత్తారింటికి వెళుతుందని అనుకుంటే.. ఎన్ని ట్విస్టులో..!

Bride left home with groom what happened next will surprised you.పెళ్లి అయిన కొన్ని గంటలకే ఓ వధువు ప్రియుడితో

By M.S.R  Published on  20 Dec 2021 12:05 PM IST
పెళ్లి అయ్యింది.. అత్తారింటికి వెళుతుందని అనుకుంటే.. ఎన్ని ట్విస్టులో..!

పెళ్లి అయిన కొన్ని గంటలకే ఓ వధువు ప్రియుడితో వెళ్ళిపోయింది. భర్తతో వెళుతున్న కారు ఆపి కిందకు దిగి మరీ ప్రియుడితో కలిసి బైక్‌పై పరారైంది. ఆ అమ్మాయి తన ప్రేమికుడితోనే జీవితాన్ని గడపాలని ఫిక్స్ అయ్యి ఇలా చేసింది. పోలీసులు వారిద్దరినీ పట్టుకుని ఎస్‌డీఎం ఎదుట హాజరుపరిచారు. స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అందరిని ఒప్పించి ఆమె ప్రేమికుడి ఇంటికి వెళ్లింది.

ఈ ఘటన డిసెంబర్ 14న మధ్యప్రదేశ్ లోని సత్నా లోని అహిర్‌గావ్‌ సమీపంలో చోటు చేసుకుంది. కుష్వాహా కుటుంబంలో ఒక వివాహం జరిగింది. సోమవారం సాయంత్రం వరుడు ఊరేగింపుతో వచ్చాడు. హిందూ సంప్రదాయం ప్రకారం, అతను వధువును వివాహం చేసుకున్నాడు. వివాహ వేడుకలు పూర్తయిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం వధువుకు వీడ్కోలు పలకగా.. వధువు వరుడితో కలిసి కారులో అత్తమామల ఇంటికి వెళ్లింది. వధువు కారులో వెళుతూ 4 కి.మీ దూరం తర్వాత ఆపింది. అప్పటికే అక్కడికి మోటార్ సైకిల్ తీసుకొచ్చిన ప్రియుడు అశోక్ యాదవ్ తో కలిసి పారిపోయింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన వరుడు తిరిగి గ్రామానికి వెళ్లి బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వధువు కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

వధువు సోదరుడు సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా అమ్మాయి, అబ్బాయిని పట్టుకున్నారు. అయితే అత్తమామల వద్దకు వెళ్లేందుకు అమ్మాయి నిరాకరించింది. పోలీసులు ప్రేమికురాలిని SDM ముందు హాజరుపరిచారు. తనకు అత్తవారింటికి వెళ్లడం ఇష్టం లేదని బాలిక SDM ఎదుట చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్ అశోక్‌తో కలిసి జీవించాలనుకుంటున్నట్లు ఆమె SDMకి చెప్పింది. దీంతో ఇరు వర్గాలు ఇక చేసేది లేక రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెను బాయ్ ఫ్రెండ్ తో పంపించేశారు.

Next Story