గెస్ట్ లను గూగుల్ మీట్ లో.. భోజనాలు జొమాటోలో..!

Bengal couple invites guests on Google Meet.కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని

By M.S.R  Published on  20 Jan 2022 8:20 AM GMT
గెస్ట్ లను గూగుల్ మీట్ లో.. భోజనాలు జొమాటోలో..!

కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా వివాహాలు జరిగే విధానాన్ని మార్చింది. గత రెండు సంవత్సరాలుగా, కోవిడ్-19 పరిమితులు, లాక్‌డౌన్‌ల కారణంగా చాలా మంది తమ వివాహ వేడుకలను వీడియో కాల్‌లలో పూర్తి చేశారు. ఎన్నో జంటల పెళ్ళిళ్ళను వర్చువల్ టెక్నాలజీలో చూడాల్సి వచ్చింది. గత వారం తమిళనాడుకు చెందిన ఒక జంట తమ వివాహం మెటావర్స్‌లో జరుగుతుందని ప్రకటించి షాకిచ్చింది. రిచ్ యూజర్ల ఇంటరాక్షన్‌ని సృష్టించడానికి సోషల్ మీడియా భావనలతో పాటు మెటావర్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ(AR), వర్చువల్ రియాలిటీ (VR) మరియు బ్లాక్‌చెయిన్‌లను ఉపయోగిస్తుంది దినేష్ SP మరియు జనగానందిని రామస్వామి హ్యారీ పోటర్-నేపథ్య వర్చువల్ వేదికతో ముందుకు వచ్చారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సందీపన్ సర్కార్, అదితి దాస్ దంపతులు జనవరి 24న జరిగే తమ వివాహానికి 450 మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. చాలా మంది అతిథులు Google Meetలో వేడుకకు హాజరవుతారు. ఇక వారికి పెళ్లి భోజనం Zomato ద్వారా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ప్రస్తుత కోవిడ్-19 నియంత్రణల కారణంగా బుర్ద్వాన్‌కు చెందిన జంట వివాహాన్ని వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Google Meet సెషన్‌లో పాల్గొనే అతిథులందరూ తమ ఇళ్లలో నుండి వివాహ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించగలరు. ఒకేసారి 250 మంది వ్యక్తులు చేరే పరిమితి ఉన్నందున, అతిథులతో రెండు లింక్‌లు షేర్ చేయబడతాయి. జనవరి 4 మరియు 14 మధ్య తనకు కోవిడ్ వచ్చి ఆసుపత్రిలో చేరినప్పుడు పెళ్లి ఆలోచన వచ్చిందని సందీపన్ సర్కార్ చెప్పారు. ఇక 100 నుండి 120 మంది అతిథులు భౌతికంగా వివాహానికి హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ సంవత్సరం వివాహ పరిమితులను 50 మంది అతిథుల నుండి 200 మంది అతిథులకు సడలించింది.

వర్చువల్ గెస్ట్‌లందరికీ ఫుడ్ డెలివరీ చేసే కంపెనీ జోమాటో ఈ ఆలోచనను ప్రశంసించింది. "ఇది మాకు చాలా కొత్త ఆలోచన. నేను కంపెనీలోని సీనియర్‌లతో మాట్లాడాను, వారు దానిని స్వాగతించారు. ఈ వివాహం కోసం మేము ఇప్పటికే ఒక బృందాన్ని సిద్ధం చేసాము. కరోనా మహమ్మారి సమయంలో ఇటువంటి చర్యను మేము అభినందిస్తున్నాము. మేము ఈ ఈవెంట్‌ను ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము," అని జొమాటో అధికారి మీడియాతో చెప్పారు.

Next Story