ఆక్టోపస్ విన్యాసాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 7:16 AM GMT
ఆక్టోపస్ విన్యాసాలు

ఆక్టోపస్ అంటే ఒక కేంద్రం 8 కాళ్లు ఇంతే మనకు తెలుసు. కానీ వీటిలో కూడా రకరకాలు ఉంటాయి. అలాంటి ఓ వింత ఆక్టోపస్‌ను పసిఫిక్ మహా సముద్రంలో కనుగొన్నారు. దక్షిణ పసిఫిక్‌లోని జార్విస్ ఐలాండ్ పక్కనే ఉన్న సముద్ర జలాల్లో కనపడింది ఈ అక్టోపస్. ఇది బెల్ పెప్పర్ షేప్ అంటే మనం క్యాప్సికమ్ అంటామే ఆ రూపంలో కనపడింది. కొంతసేపు తరువాత అదే ఆక్టోపస్ రూపంలోకి మారింది. అది కూడా ఒక పక్షి రెక్కలు విచ్చుకుంటున్నట్టు, ఒక సీతాకోక చిలుక తన రెక్కలు విదిలించుకొని ఆడుకుంటున్నట్టు కనిపించింది. తర్వాత అది క్రమంగా పూర్తి ఆక్టోపస్ రూపాన్ని సంతరించుకుంది. సముద్రానికి సుమారు 13 వందల అడుగుల లోతున ఈ అద్భుత దృశ్యం ఆవిష్కరించబడింది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.



Next Story