రాశి ఫలాలు : తేదీ 4-10-2020 ఆదివారం నుంచి 10-10-2020 శనివారం వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Oct 2020 6:47 AM GMT
రాశి ఫలాలు : తేదీ 4-10-2020 ఆదివారం నుంచి 10-10-2020 శనివారం వరకు

5-10-2020 సోమవారం *సంకష్టహర చతుర్థి* *గణపతి ఆరాధన* చాలా మంచిది

6 10 2020 భౌమ చతుర్ధి. *సుబ్రహ్మణ్య ఆరాధనకు* *గణపతి ఆరాధన* కు చాలా మంచిది

11-10-2020 ఆదివారం *పుష్యార్క యోగం* *ఉపాసన* కు *మంత్ర అనుష్ఠానానికి* చాలా మంచిది

మేష రాశి :- ఈ రాశి వారు శత్రునాశనం పొందుతూ ధన లాభం, బంధు దర్శనాన్ని పొందగలుగుతారు. కుజ గ్రహ స్థితి బాగా లేదు కనుక కొంచెం కష్టం అనుభవించక తప్పదు. శని రాజకీయ పరమైన చిక్కులు కలిగిస్తూ ఉంటే రాహుకేతువులు అకారణంగా కలహములు కలిగిస్తున్నారు. మీరు ఏ మాట అన్న సరే ఇబ్బందితో కూడినదిగా మారిపోతూ ఉంటుంది. తోటివారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం చాలా అవసరం. బుధ గురు శుక్ర వల్ల వీళ్ళు మంచి ఆలోచన చేయడమే కాకుండా గురు బలం చేత లాభం పొందుతారు. శుక్ర గ్రహ ప్రభావం చేత ఎక్కువ మంది బంధువులు చూడగలుగుతారు అంటే విశేషంగా ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా ధన వ్యయం కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో ప్రయత్నాలు చాలా మంచివి. ఈ వారంలో వీరికి 54 శాతం శుభఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్ర జాతకులకు జన్మతార అయింది ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి అనుకూలిస్తుంది. కృత్తికా 1వ పాదం వారికి మిత్ర తార అయింది కాబట్టి చాలా శుభ ఫలితాలు వర్తిస్తాయి.

పరిహారం :- 6వ తేదీ మంగళవారం సుబ్రహ్మణ్య అర్చన, ఆరాధన, దర్శనం గాని చేయండి సుబ్రహ్మణ్యాష్టకం చదవండి.

వృషభ రాశి :- ఈ రాశి వారికి ధనప్రాప్తి అలంకార ప్రాప్తి కుటుంబ సానుకూలత ఇది మిమ్మల్ని కొంతవరకు ఆనందాన్ని ఇచ్చి నడిపిస్తాయి. రవి ప్రభావం చేత మీకు లోపల్లోపల భయం కలుగుతుంది. చంద్రుడు కూడా ధన వ్యయాన్ని ఎక్కువగా సూచిస్తున్నాడు జాగ్రత్తగా వ్యవహరించండి. కుజ బుధ శుక్రులు మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ప్రతి పని కూడా సానుకూలంగా ముందుకు వెళ్లి పోతుంది. ఎన్ని ఆటంకాలొచ్చినా కూడా కుజ గ్రహ అనుకూలత చేత సాధన చేయగలుగుతారు. బుధుని ప్రభావం చేత మంచి ఆలోచన చేయగలిగితే ముందుకు వెళ్లి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్ర ప్రభావం చేత ఇంట్లో భార్య పిల్లల బంధువుల సహకారం ఎక్కువగా మీకు లభిస్తుంది. శని మాత్రం అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. రాహు కేతువుల శత్రు వృద్ది భయాన్ని సూచిస్తున్నారు కాబట్టి మీరు ఈ వారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. మీకు ఫలితాలు కూడా 36 శాతం మాత్రమే శుభాన్ని చేకూరుస్తున్నాయి. కృత్తిక 2 3 4 పాదాలు వారికి మిత్ర తార అయింది కాబట్టి ఆర్థిక వనరులు సమకూరుతాయి. రోహిణి నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. మృగశిర 1 2 పాదాలు వారికి సాధన తార అయింది కాబట్టి పనులన్ని సులువుగా నెరవేరుతాయి.

పరిహారం :- ప్రతిరోజు రాహుకేతువుల దర్శనము, నవగ్రహ దర్శనం, శివారాధన, శివ స్తోత్ర పఠనము మంచి ఫలితాలనిస్తాయి.

మిధున రాశి :- ఈ రాశి వారికి బంధుమిత్రులతోను కుటుంబ సభ్యులతోను సంతోషాన్ని పంచుకొని కలిసికట్టుగా జీవనం సాగిస్తారు. కుజ గురు శుక్ర ప్రభావం చేత వీళ్ళు చాలా పనులను తెలివిగా వ్యవహరించి సానుకూల పరుచుకుంటారు. బుధ గ్రహ ప్రభావం చేత ఒకప్పుడు మీ మాట మీరే వినకపోవడం వల్ల ఆందోళనకి గురి అవుతారు. ఏమైనా సరే ధనలాభము అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి కోర్సులన్నీ సర్దుకు పోతాయి. విలాసవంతమైన జీవితం కోసం ఖర్చులు పెరుగుతాయి. అని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. శని ప్రభావం చేత ఇంట్లో కుటుంబ సభ్యులకి అనారోగ్యం, మీకు మీ శ్రీమతి అనారోగ్యం ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోయి నట్లయితే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. రవి శనులు ఇద్దరూ కూడా మీకు అనుకూలంగా లేరు. మీకు ఈ వారంలో 54 శాతం శుభఫలితాలు ఉంటాయి కనుక చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. మృగశిర 3 4 పాదాలు వారికి సాధన తార అయింది పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. పునర్వసు 1 2 3 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి మంచి ఫలితాలు ఉన్నాయి.

పరిహారం : శనికి జపం చేయించండి. నల్లని వస్త్రము నువ్వులు, నువ్వుల నూనె దానం చేయించండి. కలి శంకర స్తోత్రం హరే రామ హరే రామ శ్లోకం 108 సార్లు పఠించండి.

కర్కాటక రాశి :- ఈ రాశి వారికి సంపదలు లాభాలు శత్రువుల పైన విజయము విశేషధనప్రాప్తి శుభ ఫలితాలు గా చెప్పవచ్చు. ఇన్నాళ్లు పడిన శ్రమకు తగ్గ ఫలితం ఈ వారం నుంచి లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ఆలోచన ఒక కొలిక్కి రాకపోవడం వల్ల మీరు ఇబ్బంది లోంచి బయట పడతారు. నిజానికి మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు సామాన్య మైనవి కావు. కుజ గురు గ్రహ బలాలు మీకు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి పనిలో ని ఆటంకాలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. రవి బుధ శుక్రులు మీకు అనుకూలంగా ఉండటంతో మీ పనులలో కాస్త ధైర్యం స్టైర్యం పెరుగుతున్నాయి. ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి రాబోతున్నాయి. శుభ ఫలితాలను మీరు అతి తక్కువ కాలంలోనే చూడగలుగుతారు. గోచార శని ప్రభావము మీ పైనే ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో మీరు 54 శాతం శుభ ఫలితాలను పొందగలుగుతున్నారు. పునర్వసు 4వ పాదం వారికి క్షేమ తార అయింది కాబట్టి శుభం జరుగుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రమే సంపత్తార అయింది కాబట్టి చాలా మంచి ఫలితాలను పొందగలుగుతారు.

పరిహారం :- గురువారం నియమం పాటించండి. దత్తాత్రేయ చరిత్ర., దక్షిణామూర్తి స్తోత్రం, హయగ్రీవ స్తోత్రం పఠించిన మంచి ఫలితాలు లభిస్తాయి.

సింహరాశి :- ఈ రాశి వారికి సౌఖ్యము లాభము సర్వసంపదలు ఇవన్నీ కలిసి ఆనందింపజేసి ఈ వారం చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం కల్పిస్తున్నాయి. వీరికి రవి స్థితి బాగా లేదు కనుక ఆందోళన, భయం ఎక్కువగా ఉంటుంది. దానికితోడు కుజ బుధుల స్థితి కూడా ఆందోళనకరంగా ఉంది దీని వల్ల అనారోగ్యం పాలయ్యే లేదా యాక్సిడెంట్ లో అలాంటివి జరిగే అవకాశం కనిపిస్తోంది చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి వారు ఇన్నాళ్లు వీరికి ఏం చేసినా పర్వాలేదు లే అని చెల్లి పోతూ ఉండేది. అటువంటిది ఇప్పుడు ఒక్కసారి గ్రహస్థితి లో పరిణతి చెందడం వల్ల సింహ రాశి ఫలితాలు చాలా మార్పులు వచ్చాయి. శత్రువు బాధ ఎక్కువైంది. కుటుంబ వ్యవహారాలు మాత్రం కొంచెం చక్కబడతాయి. మీరేమైనా శుభ కార్యాలు చేసుకోవాలనుకుంటే అక్టోబర్లో ఇక్కట్లు ఎక్కువగానే ఉన్నాయి. వీరికి వారంలో 45 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. మఖా నక్షత్ర జాతకులకు జన్మ తారయింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. పుబ్బ నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది బావుంది. ఉత్తర 1వ పాదం వారికి మిత్ర తార అయింది కాబట్టి శుభ ఫలితాలు వర్తిస్తాయి.

పరిహారం :- రవికి జపం, గోధుమలు దానం, సూర్య నమస్కారాలు చేసిన మంచి ఫలితాలు వస్తాయి. కెంపు ధరిస్తే చాలా మంచిది. 6-10-2020 భౌమ చతుర్ధి నాడు సుబ్రహ్మణ్య పూజ చేయండి

కన్యా రాశి :- ఈ రాశి వారికి ఉత్సాహం వల్ల సౌఖ్యము స్వర్ణ ప్రాప్తి ఉంది. సంపదనలు కూడా చేకూరుతాయి. వీరికి గ్రహస్థితులు చాలా ప్రతికూలతలు వచ్చాయి. రవిచంద్రులు ప్రతికూలంగా ఉండటం చేత పనులన్నీ కొంచెం వాయిదా పడుతూ ఉంటాయి. వీరికి గురుబలం చాలా తక్కువ అయింది కాబట్టి సాధ్యమైనంత వరకూ దైవ చింతన కలిగి ఉంటేనే కానీ పనులు నెరవేరవు. అంతే కాదు సంపాదించిన దాంట్లో కూడా అనవసరంగా ఖర్చయిపోతుంది. వీరికి రావలసిన బాకీలు వసూలు కావడం కొంచెం కష్టంగా ఉంటుంది. అంతే కాదు కుటుంబపరమైన వ్యవహారాలు కూడా ఇబ్బంది. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త వహించడం చాలా అవసరమ్. వీరికి శత్రుభావాలు కలవారు ఎక్కువ అవుతున్నారు. మీకు 36 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఈ వారం లో ఉన్నాయి.ఉత్తర 2 3 4 పాదాలు వారికి మిత్రతార అయింది కాబట్టి చాలా అనుకూలంగా బాగుంది. హస్తా నక్షత్ర జాతకులకు నైధనతార అయింది కాబట్టి ప్రతికూలత ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్ర 1 2 పాదాలు వారికి సాధన తార అయ్యింది పనులను కూడా చక్కగా నెరవేరుతాయి.

పరిహారం :- బియ్యం, తెల్లని వస్త్రం దానం చేయండి. ఎవరికైనా అన్నం పెట్టండి. భౌమ చతుర్థి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి.

తులారాశి : ఈ రాశి వారికి ధన ప్రాప్తి, ధనలాభము ముందుకు నడిపిస్తాయి. కుజుడు శుక్రుడు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నారు. మీకు కొంత ధనసంపాదన చేకూరుతుంది. తప్పితే ఆరోగ్య విషయాల్లో గాని ఇంకేం విషయాలు కానీ మీరు జాగ్రత్త వహించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. బుధుడు చిక్కులు కొని తెచ్చి పెడతాడు. గురు బలం లేకపోవడం వల్ల మీరు మీ ఆలోచనల్ని కూడా వ్యతిరేకంగా పనిచేసి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏకాగ్రత భంగం మీకు ఎక్కువగా చెప్పబడి ఉన్నది. శని ప్రభావం చేత కడుపునొప్పి అల్సర్లు ఇంకేమైనా అనారోగ్యాలు సూచి పెడుతున్నాయి. విలువైన ఎటువంటి వస్తువులు పోగొట్టుకున్న అవకాశాలు కూడా ఉన్నాయి. తోటివారు మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంది. వారు మిమ్మల్ని ఎక్కువగా అవమాన పరుస్తూ ఉంటారు ఇవన్నీ తట్టుకోవాలి. మీకు ఈ వారంలో 27 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి. చిత్త 3 4 పాదాలు వారికి సాధన తార అయింది కాబట్టి పనులు చక్కబడతాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయ్యింది కాబట్టి ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. విశాఖ 1 2 3 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి ఎక్కువగానే ఉంటాయి.

పరిహారం : ప్రతి రోజు శివ స్తోత్రాలు శివాభిషేకము మంచి ఫలితాలు ఇస్తాయి. నవగ్రహాలకు పూజలు గాని దర్శనానికి గాని చేయండి.

వృశ్చిక రాశి :- ఈ రాశి వారికి ధన లాభం సంతోషం ఇవి మిమ్మల్ని చాలా ఆనందపరచి ఉత్సాహంగా ముందుకు తీసుకువెళతాయి. . మానసిక ఒత్తిడులు మానసిక ఆందోళన ఉన్నా చాలా సంతోషంగా ఉంటారు. కుజ బుధ గ్రహాల ప్రతికూలతలు మీకు చాలా ఇబ్బందులను కలిగిస్తాయి. అయినాగురు శుక్రులు వారితో పాటు శని కలిసి ప్రభావము మీ పై చూపించి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళతాయి. ఎన్నడూ లేని ఆనందం తృప్తి పొందగలుగుతారు. ఏదైనా ఒక ఉన్నతమైన పదవిని గౌరవాన్ని పొందే అవకాశం కూడా లేకపోలేదు. రాహు కేతువులు లగ్న సప్తమంలో ఉండటం వల్ల వాటి ప్రభావం చేత మీకు శత్రువులు పెరుగుతున్నారు అనే భయం కూడా అభివృద్ధి చెందుతోంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. 54 శాతం శుభ ఫలితాలు మీరు ఈ వారంలో పొందనున్నారు. విశాఖ 4వ పాదం వారికి క్షేమ తార అయింది కాబట్టి చాలా బాగుంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. జ్యేష్ట నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి ఆర్థిక వనరులు సమకూరుతాయి.

పరిహారం :- బుధవారం నియమాలు పాటించండి. ముందు రోజు నాన వేసిన పెసలు బుధవారం బెల్లంతో ఆవుకు తినిపించండి. కందులు దానం చేయండి.

ధను రాశి :- ఈ రాశి వారికి కార్య జయము ఆనందము సుఖ జీవితం సమకూరుతాయి. వీరు ఎన్నడూ లేని ఆనందాన్ని ఈ వారం నుంచి పొందగలుగుతారు అని చెప్పొచ్చు. ఆత్మస్థైర్యం కలుగుతుంది కానీ ఆకస్మికంగా దాడులు తప్పవు. అవి మీరు భరించాలి కూడా. విశేష ధనాన్ని ఎలాగైతే సంపాదిస్తారు అందుకు తగ్గ ఖర్చులు కూడా మీరు భరించడానికి సిద్ధంగా ఉండాలి. మీకు వ్యతిరేకంగా పనిచేసిన వారందరూ ఈ వారంలో చక్కగా అనుకూలంగా పని చేస్తూ మీతో పనులు చేయించుకుంటూ సహకరిస్తూ ఉంటారు. ద్వితీయ శని ప్రభావం మీ మీద ఉంది కనుక ఎంత సంపాదిస్తారు అంత ఖర్చు మీరు పెట్టడానికి సిద్ధపడుతూ ఉండవలసిందే. చిన్నచిన్న ఆటంకాలొచ్చినా మీరు వాటిని సులువుగా దాటి పోతారు. స్థిరాస్తి వ్యవహారాలు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 54% శుభ ఫలితాలు మీరు ఈ వారంలో పొంద బోతున్నారు. మూలా నక్షత్ర జాతకులకు జన్మ తార అయింది కాస్త ఆరోగ్యం జాగ్రత్త వహించండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కాబట్టి సానుకూలంగా ఉండొచ్చు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి మిత్ర తారయింది మంచి ఫలితాలను పొందనున్నారు.

పరిహారం : శనికి జపం, నల్లని వస్త్రదానము నువ్వుల దానం నువ్వుల నూనె దానం మంచిది. సోమవారం నాడు శివునికి అభిషేకం చేయించండి.

మకర రాశి :- ఈ రాశి వారికి సకల భోగాలు అమరుతాయి. సంతోషము ఉంటుంది ఈ వారంలో వీరు పాత బాకీలు వసూలు చేసుకోవడం కొంతవరకూ కృతకృత్యులు కాగలుగుతారు. మధ్యవర్తిత్వం లోని భూ సంబంధ విషయాల్లో ని కూడా వీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుజ బుధ శుక్రులు వీరికి మంచి అనుకూలంగా ఉన్నారు కనుక మీరు ఈ సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటే ఇంకా బాగుంటుంది. కేతు వీరికి అనుకూలంగా ఉన్నాడు గనుక దైవ పరంగా ఉండే లాభాలు చేకూరుతాయి. అంటే ఏ పని చేసిన దైవాన్ని సంకల్పించినట్లు అయితేనే మంచి మంచి జరుగుతుంది. గురు ప్రభావం కొంచెం పని చేస్తోంది శ్రమకు తగిన ఫలితం లభించదు నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. ఒకసారి గురువు గారిని భరిస్తూ ఏపనైనా చేయండి. జన్మశని ప్రభావం కూడా మీ పైన ఎక్కువగానే ఉంది. యోగ సాధన మెడిటేషన్ ఏకాగ్రత మీకు చాలా అవసరము. ఈ వారంలో మీకు 45 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి మిత్ర తార అయింది చాలా మేలుజరుగుతుంది శ్రవణా నక్షత్ర జాతకులకు నైధన తార అయింది కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ధనిష్ట 1 2 పాదాలు వారికి సాధన తార అయింది కాబట్టి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.

పరిహారం :- శని జపం చేయించండి గురు స్తోత్ర పఠనం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ శుభప్రదమైనవి.

కుంభ రాశి :- ఈ రాశి వారికి కాస్తంత సంతోషం మాత్రమే మిగులుతుంది. అంతో ఇంతో ధనలాభము కలుగుతుంది. ఈ వారం వీరికి చాలా క్లిష్టమైన స్థితి అని చెప్పాలి. అనేక రకాలుగా వీరు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. సిద్ధంగా ఉండి తీరాలి. వీరికి యోగించే గురుడు ఒక్కడే లాభంలో ఉన్నాడు గనుక మేలు చేస్తున్నాడు. నవగ్రహాలు వీరికి ఇబ్బందినే కలిగిస్తున్నాయి. మనసు కారకుడైన చంద్రుడు కూడా వీరికి అనుకూలం గా లేడు. మొత్తంమీద ఈ వారంలో అనేక రకాలైన నష్టాలను చవిచూడ వలసిన పరిస్థితి వస్తుంది. గౌరవానికి భంగం వాటిల్లే స్థితి కూడా ఉంది కాబట్టి మీరు ఏకాగ్రత కలిగి మాటని అదుపులో పెట్టుకుని మీకు మీరే నియంత్రించుకుంటూ ఉండాలి. అలా అయితేనే పరిస్థితులు చక్కబడతాయి. నిరాశ నిస్పృహలతో కృంగి పోయే స్థితి మంచిది కాదు కనుక ముందుగా హెచ్చరికగా చెబుతున్నాము. మీకు ఈ వారంలో 18 శాతం మాత్రమే శుభ ఫలితాలు ఉన్నాయి, ధనిష్ట 3 4 పాదాలు వారికి సాధన తార అయింది కాబట్టి పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. శతభిషా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార కాబట్టి ప్రతిపని వాయిదా పడుతుంది. పూర్వాభాద్ర 1 2 3 పాదాలు వారికి క్షేమ తార అయింది కాబట్టి పనులన్నీ బాగా నెరవేరుతాయి.

పరిహారం :- గ్రహశాంతి చేయించుకోండి. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం సత్ఫలితాలనిస్తుంది. సప్తశతి పారాయణ మంచిది.

మీన రాశి :- ఈ రాశి వారికి అతి ప్రీతిపాత్రమైన వాళ్ళు కలవడము, వాళ్ల ద్వారా మీకు ఇష్టమైన పనులు జరగడం, సంపద సమకూరడం ఈ వారంలో వీరికి రాసిపెట్టి ఉంది. అయితే రవి ప్రభావం చేత వీరు సమస్యల్ని ఎదుర్కొన వలసి వస్తున్నట్లు కనిపిస్తోంది. శుక్ర ప్రభావం చేత అపకీర్తి ఉంది. ఆరు గ్రహాలు ప్రతికూలంగా పని చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీరు అతి జాగరూకతతో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అసలే చంచలమైన రాసి. మనః కారకుడైన చంద్రుడు మీకు అనారోగ్యాన్ని సూచిస్తున్నాడు. రవి కుజులు ఇద్దరూ కూడా బాధాకరమైన విషయాన్ని సూచిస్తున్నారు. ఇటువంటి సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గురుడు కూడా మీ శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇవ్వలేనని అంటున్నాడు. మరి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరే నియంత్రించు కొని నిలబడాలి. పైగా మీకు ధైర్యం బలము తక్కువ అనే భావన ఎక్కువైపోతోంది. దానిని దృష్టిలో పెట్టుకుని మీరు మీ ధార్మిక చింతన కలిగి ఉన్నట్లయితే దైవ పరంగా మీకు అనుకూల పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ వారంలో 36 శాతం మాత్రమే శుభఫలితాలను పొందగలుగుతారు. పూర్వాభాద్ర 4వ పాదం వారికి క్షేమ తార అయింది కాబట్టి శుభఫలితాలుంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు విపత్తార అయింది కాబట్టి అనుకూలంగా లేదు సమస్యలు ఎక్కువవుతాయి. రేవతి నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

పరిహారం :- సోమవారం నాడు గణపతి అర్చన, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆవరణ అర్చన లేదా సుబ్రహ్మణ్య స్తోత్రము పారాయణ చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు.

Next Story