అరాచకానికి కేరాఫ్ అడ్రెస్ ఫోటో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చే
By తోట వంశీ కుమార్ Published on 19 May 2020 9:02 PM ISTఆర్.ఆర్.ఆర్. టీమ్. ఈనెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించిన వీడియోను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావించారు. ఎంతో ఆతృతగా ఎదురుచూసారు. కానీ అనుకున్నట్లుగా పని పూర్తీ కాలేదని ఆర్.ఆర్.ఆర్. టీమ్ తెలిపింది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఓ వీడియోను విడుదల చేయాలని ముందు నుండి భావించామని.. చాలా ప్రయత్నాలు కూడా చేశామని.. కానీ అనుకున్న సమయానికి పూర్తీ చేయలేకపోయామని ఆర్.ఆర్.ఆర్. టీమ్ సోషల్ మీడియాలో తెలిపింది.
కానీ ఓ వ్యక్తి మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్. లాయిడ్ స్టీవెన్స్ ఫ్యాన్స్ కోసం కొన్ని సర్ ప్రైజ్ లు సిద్దం చేసినట్టు తెలిపాడు. ఈ రోజు ఒక్కొక్కటిగా విడుదల కానున్న సర్‌ప్రైజింగ్‌ల కోసం ఫ్యాన్స్ అందరు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశాడు. అనుకున్నట్లుగానే ఈ రోజు సాయంత్రం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్న ఫోటోను బయటకు వదిలారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని తీసిన ఈ ఫోటో తాజాగా స్టీవెన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం వదిలాడు. అరాచకం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫోటోను తెగ షేర్ చేస్తూ ఉన్నారు.
ఆర్.ఆర్.ఆర్. నుండి వీడియో వస్తుంది అని ఆశించి హర్ట్ అయిన ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియాలో ఓ లెటర్ ను పెట్టిన సంగతి తెలిసిందే. RRR చిత్రం నుండి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల కావటం లేదు అనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను. ఫస్ట్ లుక్ లేదా టీజర్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్ర బృందం ఎంతగా కష్టపడింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు.రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది. నా విన్నపాన్ని మన్నిస్తారని ఎన్టీఆర్ తెలిపారు.