ఎన్‌ఆర్‌ఐలు పన్ను చెల్లించే విషయమై పెద్ద తికమక..!

By అంజి  Published on  3 Feb 2020 6:53 AM GMT
ఎన్‌ఆర్‌ఐలు పన్ను చెల్లించే విషయమై పెద్ద తికమక..!

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఇటీవల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ బడ్జెట్‌లో ఎన్.ఆర్.ఐ.ల విషయంలో చేసిన వ్యాఖ్యలు చాలా కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేశాయి. బడ్జెట్‌లో ఎన్.ఆర్.ఐ.ల ఆదాయం ట్యాక్స్ పరిగణలోకి వస్తుందని అన్నారు. దీంతో ఎన్.ఆర్.ఐ.లు కూడా పెదవి విరిచారు. అధికారులు కూడా ఇదేంటని అనుకున్నారు. కానీ ఎన్.ఆర్.ఐ.లు విదేశాల్లో సంపాదించిన దానికి భారత్‌లో పన్ను కట్టనవసరం లేదని.. భారత్‌లో ఎక్కడైతే వారికి ఆదాయ వనరులు ఉంటాయో.. వాటి నుండి వచ్చే ఆదాయానికి మాత్రమే పన్ను కట్టవలసి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

ఆదివారం నాడు ఆమె మాట్లాడుతూ.. కొత్త పన్ను విధానంపై ఎవరూ తికమక పడాల్సిన అవసరం లేదని.. వేరే దేశాల్లో సంపాదించే వాటికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. భారత్‌లో ఉన్న వారి ఆస్తుల నుండి వచ్చే ఆదాయంపై భారత ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుందని ఆమె అన్నారు. అలాగే ప్రవాస భారతీయలుగా పరిగణించే రోజుల సంఖ్యను కూడా తాము తగ్గించామని నిర్మల సీతారామన్ చెప్పుకొచ్చారు. గతంలో 240 రోజులు ఉంటేనే ప్రవాస భారతీయుడిగా పరిగణించేవాళ్ళు.. ఇప్పుడు 182 రోజులు ఉన్నా ప్రవాస భారతీయుడి కిందకే వస్తారని ఆమె అన్నారు.

ఈ కొత్త బిల్లుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. దీని వలన భారతీయలు ఇబ్బంది పడతారంటూ పినరయి విజయన్ నరేంద్ర మోదీకి ఆదివారం నాడు లేఖ రాశారు. కేరళకు చెందిన కొన్ని లక్షల మంది గల్ఫ్ దేశాల్లో వున్నారు. వారి నుండి వచ్చే డబ్బులతోనే భారత్ అభివృద్ధి చెందుతుందని.. కానీ ఇతరదేశాలలో సంపాదించే డబ్బుపై కూడా ట్యాక్స్ చెల్లించాలని చెప్పడం చాలా తప్పని ఆయన అన్నారు.

ఈ అయోమయాన్ని నిర్మల సీతారామన్ తీరుస్తూ వేరే దేశాల్లో సంపాదించే వాటికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని.. భారత్ లో ఉన్న వారి ఆస్తుల నుండి వచ్చే ఆదాయంపై మాత్రమే భారత ప్రభుత్వం పన్ను వసూలు చేస్తుందని ఆమె అన్నారు.

Next Story