అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

By రాణి
Published on : 13 Dec 2019 5:17 PM IST

అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుమ్మడికాయల ద్వారాకనాథ రెడ్డి అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్లివారిపల్లికి చెందిన ద్వారాకనాథ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమెరికాలోని అమెజాన్ కంపెనీలో అతను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై స్పష్టత లేదు. కాగా ద్వారాకనాథ రెడ్డికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, వివాదాలు కానీ లేవని బంధువులు చెబుతున్నారు. ద్వారాకనాథ రెడ్డి బలవన్మరణంతో అతని స్వస్థలంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారత కాలమాన ప్రకారం ద్వారకనాథ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story