జాతీయ జనాభా నమోదు (ఎన్‌పీఆర్‌) ప్రక్రియను నిలపుదల చేస్తూ ఏపీ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది. బుధవారం సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనాభా లెక్కలు దేశంలో పదేళ్లకోసారి జరుగుతాయి. 2010లో జరిగిన ఈ లెక్కలపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఇక కొత్తగా కొన్ని ప్రశ్నలు చేర్చడం వల్ల వివాదాలకు దారి తీసింది. అందుకే 2010లో అడిగిన ప్రశ్నలతోనే ఇప్పుడు కూడా ఎన్‌పీఆర్‌ ప్రక్రియ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేశారు. కాగా, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చే వరకు రాష్ట్రంలో ఈ ప్రక్రియను నిలిపివేయాలని మంత్రివర్గం తీర్మానం చేసినట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎన్పీఆర్‌ ను నిలుపుదల చేసే అధికారం రాష్ట్రానికి ఉంటుందా..? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేంద్రం అధికారాలు కేంద్రానివి, రాష్ట్రం అధికారాలు రాష్ట్రానివని చెప్పుకొచ్చారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.