ఇది వరకు పాన్‌కార్డు కావాలంటే దాదాపు 15 నుంచి 20 రోజులు ఆగాల్సి ఉంటుంది.  కానీ ఇప్పుడు అంత సమయం పట్టదు. సులభంగా పొందేందుకు అవకాశం కల్పించింది కేంద్రం. ఇటీవల బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పాన్‌ కార్డుపై కీలక విషయాలు వెల్లడించారు. పాన్‌కార్డు అవసరమున్న వారికి వెంటనే జారీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆధార్‌కార్డు ఉంటే చాలు పది నిమిషాల్లోనే కార్డు పొందే అవకాశం వచ్చేసింది. ఆధార్‌ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే వెంటనే జారీ చేస్తారు. పీడీఎఫ్‌ ఫార్మాట్ ఉండే దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకునే వెలుసుబాటు ఉంటుంది. ఆధార్‌ కార్డు ఉన్నవాళ్లు పాన్‌ కార్డు ఎలా పొందాలంటే..

ముందుగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ‘ఈఫైలింగ్‌ పోర్డల్‌లోకి వెళ్లి ఇన్‌ స్టంట్‌ పాన్‌ థ్రూ ఆధార్‌’ అనే లింక్‌పై క్లిక్‌ చేసి, ఆపై ‘గెట్‌ న్యూ పాన్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత కొత్త పాన్‌ సంఖ్య మీ ఆధార్‌ సంఖ్యను అడుగుతుంది. అక్కడ ఇచ్చిన బాక్స్‌లో ఆధార్‌ ఎంటర్‌ చేస్తే, మీ ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేయగానే ఇతర ఆధార్‌లోని వివరాలను అడుగుతుంది. మీ ఈ-మెయిల్‌, ఇతర వివరాలను పొందుపర్చాలి. యూఐడీఏఐ డేటాలో సరి చూసుకుని ఐటీ వెబ్‌ సైట్‌ వెంటనే పాన్‌ నెంబర్‌ను కేటాయిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు 10 నిమిషాల సమయం లోపే.

ఆపై మీ పాన్‌ కార్డును పీడీఎఫ్‌ ఫార్మాట్ లో డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవచ్చు. మీ ఈ-మెయిల్‌కు కూడా పాన్‌ కార్డు పీడీఎఫ్‌ వస్తుంది. అయితే మీ మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌కు అనుసంధానమై ఉండాలి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.