నవంబర్‌లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు
By సుభాష్ Published on 1 Nov 2020 5:30 AM GMTప్రజలు బ్యాంకులను ప్రతి రోజు వినియోగించుకుంటారు. అయితే నవంబర్ నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు వస్తున్నాయి. నవంబర్‌లో కూడా పండలున్నాయి. దీపావళి, కార్తీక మాసం, గురునానక్ జయంతి వస్తున్నాయి.
ఇలా బ్యాంకులకు ఐదు రోజులు సెలవులు వస్తే, ఆదివారాలు, పండగలు కలుపుకొని మొత్తం 8 రోజులు సెలవులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులు అన్ని పబ్లిక్, ప్రైవేటు బ్యాంకులకు వర్తిస్తాయి. నవంబర్ నెలలో బ్యాంకులకు ఏ రోజుల్లో సెలవులు వస్తున్నాయో చూద్దాం.
నవంబర్ - 1 ఆదివారం
నవంబర్ 8 - ఆదివారం
నవంబర్ 14- రెండో శనివారం, దీపావళి
నవంబర్ 15 - ఆదివారం
నవంబర్ 22- ఆదివారం
నవంబర్ 28 - నాలుగో శనివారం
నవంబర్ 29- ఆదివారం
నవంబర్ 30- గురునానక్ జయంతి
కాబట్టి బ్యాంకు వినియోగదారులు సెలవులను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే బెటర్.
Next Story