హత్యలు చేయమని చెప్పలేదు - సందీప్ రెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 2:26 PM GMT
హత్యలు చేయమని చెప్పలేదు - సందీప్ రెడ్డి

ముంబై: సినిమాల్లో డైలాగులు చాలా మందిని ప్రభావితం చేస్తుంటాయి. అంతేకాదు..చాలా మంది ఆ డైలాగ్‌ల ప్రభావానికి లోనై ..వాటికి అడిక్ట్ అయిపోతారు. ఆ డైలాగ్‌లు పదేపదే వినడమే కాదు ..మనసులో గట్టిగా నాటుకుంటారు. వారు కూడా ఆ డైలాగ్‌లు పదే పదే చెబుతుంటారు. ఇలాంటి ఘటనే ముంబైలో జరిగింది. తెలుగులో 'అర్జున్‌ రెడ్డి' రిమేక్‌ బాలీవుడ్‌లో కబీర్ సింగ్. అర్జున్‌ రెడ్డి విజయం సాధించినట్లే..కబీర్‌ సింగ్ కూడా సూపర్ సక్సెస్. కబీర్ సింగ్‌లో ఒక డైలాగ్ ఉంది. "నీవు నాకు దక్కకపోతే..ఇంకా ఎవరికీ దక్కకూడదు". ఈ డైలాగ్ టిక్ టాక్ స్టార్ అశ్వని కుమార్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ టిక్‌ టాక్‌ స్టార్ నిఖితా శర్మ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కు మరొకరితో పెళ్లి కుదిరిందని ఆమెను చంపేశాడు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలిసి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన పెద్ద వార్తై కూర్చుంది.

పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. కబీర్‌ సింగ్ డైలాగ్‌లు ఎక్కువుగా వినడం, వీడియోలు ఎక్కువ చూడంటంతో అశ్వనీ కుమార్ వాటి ప్రభావానికి లోనయ్యాడని పోలీసులు భావిస్తున్నారు.

ఈఘటనపై డైరక్టర్ సందీప్‌ రెడ్డి స్పందించారు. " ఈ వార్త తనను షాక్ గురి చేసిందన్నారు. నిఖితా శర్మకు జరిగిన అన్యాయానికి బాధగా ఉందన్నారు. ఓ ఫిలిం మేకర్‌గా బాధ్యత వహిస్తానన్నారు. హత్య చేయమని తన సినిమాలు చెప్పలేదన్నారు" సందీప్ రెడ్డి.

Next Story
Share it