హైదరాబాద్‌: ప్రేమ వద్దన్నందుకు కన్న తల్లినే కడతేర్చింది ఓ కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చింది. తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి మూడు రోజుల పాటు ఆ ఇంట్లోనే తల్లి శవం పక్కనే గడిపింది.

అప్పటికే మూడు రోజులు కావడంతో ఆ మరణించిన దేహాం దుర్వాసన రావడంతో ప్రియుడి సహాయంతో రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది. అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రేమికుడు శ‌శి, కూతురు కీర్తిలు జైలు ఊచ‌లు లెక్క‌బెట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. అంత ఈజీగా దొరుకుతాననుకోలేదని.. కేసులతో గొడవ అవుతుందనుకోలేదని.. తల్లిని చంపిన కీర్తి పోలీస్‌స్టేషన్‌ కన్నీళ్లు పెడుతోంది.

తల్లి ర‌జిత‌ను చంపితే త‌మ ప్రేమ‌కు అడ్డు తొలుగుతుంద‌ని భావించిన శశి.. కీర్తిన చంపేలా ప్రోత్స‌హించాడు. త‌మ ప్రేమ‌కు అడ్డుగా ఉంద‌ని ఆమెను తొల‌గిస్తే…తాము పెళ్లి చేసుకోవచ్చ‌ని నూరిపోశాడు. శ్రీనివాస్‌రెడ్డి, ర‌జిత‌ల‌కు ఒకే కూతురు కీర్తి. దీంతో ఆమె ఆస్తిపై క‌న్నేసిన శశి… ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడ‌ని తెలుస్తోంది.

శశి,కీర్తిల ల‌వ్‌స్టోరీ తెలిసిన ర‌జిత కూతురుని వారించింది. శ‌శిని తీవ్రంగా మంద‌లిచింది. దీంతో ర‌జిత‌పై క‌క్ష పెంచుకున్న శ‌శి… ఆమెను అడ్డు తొల‌గించేందుకు ప్లాన్ వేశాడు. అందులో భాగంగా కూతురు సాయంతో కీర్తిని చంపేశాలా ప్లాన్ చేసి హ‌త్య చేశాడు. మొత్తానికి ల‌వ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో ప్రేమికుడు శ‌శి, కూతురు కీర్తిలు జైలు శిక్ష అనుభవించబోతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

One comment on "అంత ఈజీగా దొరుకుతాననుకోలేదు.. తల్లిని చంపిన కూతురు కీర్తి"

Comments are closed.