భారీ అగ్ని ప్రమాదం.. పిల్లలను కాపాడుకుందని తల్లికి జైలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Jan 2020 4:08 PM GMT
భారీ అగ్ని ప్రమాదం.. పిల్లలను కాపాడుకుందని తల్లికి జైలు..!

మన ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే మనం ఏం చేస్తాం. మన ఇంట్లో చిన్నారులు ఎవరైనా ఉంటే ముందుగా వారిని రక్షిస్తాం. ఆ తరువాత సమయం ఉంటే విలువైన వస్తువులను ఇంటి నుంచి బయటికి తీసుకొస్తాం. అయితే ఈ ఘటన చూస్తే అయ్యే అనక మానదు. ఓ మహిళ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే ఆ మహిళ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తన పిల్లలను రక్షించుకుంది. ఫోటోలను వదిలివేసింది. ఇదే ఆ మహిళ చేసిన నేరంగా బావించిన అక్కడి ప్రభుత్వం ఆ మహిళను కటకటాల్లోకి నెట్టింది. అదేంటీ ఫొటోలు వదిలేస్తేనే జైలుకు పంపించేస్తారా? అనే కదా మీ డౌట్. ఔను ఎందుకంటే ఆ దేశం మరేదో కాదు ఉత్తర కొరియా.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉంగ్ పెద్ద నియంత అన్న సంగతి తెలిసిందే. తను చెప్పిందే వేదంగా పాటించాలి. అలా పాటించని వారిని చిత్ర హింసలకు గురి చేయడంతో పాటు మరణశిక్షను సైతం విధిస్తాడు కిమ్. ఇక తను చేసే చట్టాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పే ఘటన ఇది. ఉత్తర కొరియా దేశంలో ప్రతి ఇంట్లో కిమ్ కుటుంబ సభ్యుల ఫొటోలు ఉండాల్సిందే. వాటిని ప్రతి ఒక్కరూ ఆరాధించాలి. ఫోటోల్లో కాకుండా తమ కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలి. వాళ్ల ఇంట్లో చనిపోయిన పెద్దల ఫోటోలు లేకున్నా ఏం కాదుగానీ కిమ్ కుటుంబసభ్యుల ఫోటోలు లేకుంటే మాత్రం జైలుకు వెళ్లాల్సిందే.

ఇదిలా ఉంటే ఏదైన ప్రమాదాలు జరిగిన సమయంలో ఆ ఫోటోలనే ముందుగా రక్షించాలని అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు సైతం జారీ చేశాడు. ఆ ఫోటోలను గనుక రక్షించకుంటే వాళ్లకి కఠిన శిక్షలు పడే విధంగా కఠిన చట్టాలను సైతం రూపొందిచాడు. ఈ ప్రమాదంలో మహిళ ఆ ఫోటోలను తొలుత కాపాడకుండా తన పిల్లలను కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఇది అక్కడి చట్టాల ప్రకారం నేరం కావడంతో ఆ మహిళ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్ని ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతొంది. అయితే ఆ మహిళ కు కఠిన శిక్షనే విధించనున్నారని అక్కడి స్థానిక మీడియాలు తెలిపాయి.

Next Story