Fact Check: నిజమెంత: అభిజిత్ బెనర్జీ ట్విట్టర్ లో ఉన్నారా..?

By సుభాష్  Published on  8 May 2020 9:49 AM GMT
Fact Check: నిజమెంత: అభిజిత్ బెనర్జీ ట్విట్టర్ లో ఉన్నారా..?

ఎకానమిస్టులు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఇది. ఎందుకంటే వాళ్ళ పేర్ల మీద ఫేక్ అకౌంట్లు సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్నాయి. ఇండియన్-అమెరికన్, నోబెల్ అవార్డు విజేత అయిన అభిజిత్ బెనర్జీ తో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది.. ఎలాంటి మార్పులు రాబోతున్నాయి లాంటి అనేక విషయాలు చర్చించారు.

భారత ఆర్థిక వ్యవస్థ ఎలా మెరుగుపడాలో కూడా సూచనలు ఇచ్చారు అభిజిత్ బెనర్జీ. భారత దేశంలో ఉన్న పేద ప్రజల జీవితాల్లో మార్పులు రావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్పారు. ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకుని పేదలందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని సూచించారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.



రాహుల్ గాంధీతో ఛాటింగ్ ముగిసిన వెంటనే.. ట్విట్టర్ లో @AbhijitBanerj (@Polytikle ఈ రెండు అకౌంట్లు ‘AbhijitBanerj’ ‘AbhijitBabrjee’ అనే యూజర్ నేమ్స్ తో దర్శనమిచ్చాయి.

నిజమెంత:

ఈ అకౌంట్లు.. రాహుల్ గాంధీతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధించిన క్లిప్స్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అలాగే పలువురికి థ్యాంక్ యు అంటూ మెసేజీలు పెట్టుకుంటూ వచ్చారు. హన్సరాజ్ మీనా, శేఖర్ గుప్తా, రానా సఫ్వీ, ఆదిత్య మీనన్, అసదుద్దీన్ ఒవైసీ, ఫయే డిసౌజా లాంటి ప్రముఖులు కూడా సదరు అకౌంట్ లను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు.

Fact Check ..



Tt

కానీ ఆ అకౌంట్లనీ 'ఫేక్' అని అతి కొద్ది సమయంలోనే తేలిపోయింది. అవన్నీ పేరడీ అకౌంట్లనీ తేలిపోయింది. బూమ్ లైవ్ సంస్థ నివేదిక ప్రకారం ఈ రెండింటిలో ఒక అకౌంట్ కు ఇంతకు ముందు ‘Not That Swaraj’ అనే పేరు ఉండేది. కానీ ఈ అకౌంట్లు ఫేక్ అని తెలియడంతో ట్విట్టర్ వాటిని సస్పెండ్ చేసింది. ట్విట్టర్ ఆ అకౌంట్ల ను సస్పెండ్ చేసే సమయంలో.. ఓ అకౌంట్ కు దాదాపు 22.8 వేల మంది ఫాలోవర్లు వచ్చారట.



Tw

ప్రముఖ చరిత్ర కారుడు రామచంద్ర గుహ కూడా అభిజిత్ బెనర్జీ ట్విట్టర్ లో లేరని తెలిపారు.

జీషన్ రషీది కూడా ఆయన ట్విట్టర్ లో లేరని అందుకు సంబంధించిన మెయిల్ ఇది తెలిపారు.

ఆయన తన మెయిల్ లో 'నేను ట్విట్టర్ లో లేను. కానీ ఇప్పటికే రెండు ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు ట్విట్టర్ లో దర్శనం ఇస్తున్నాయని.. అవి తన అకౌంట్లు కాదని.. ట్విట్టర్ సంస్థకు ఫిర్యాదు చేశానని అన్నారు.



ఆయన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ట్విట్టర్ ఆ రెండు అకౌంట్ లను సస్పెండ్ చేసింది.

నిజమెంత: నోబెల్ ప్రైజ్ అందుకున్న ఎకానమిస్ట్ అభిజిత్ బెనర్జీ ట్విట్టర్ లో లేరు. ఆయన ఎటువంటి ట్వీట్స్ చేయడం లేదు.

Claim Review:Fact Check: నిజమెంత: అభిజిత్ బెనర్జీ ట్విట్టర్ లో ఉన్నారా..?
Claim Fact Check:false
Next Story