అయితే ఇంతకుముందు రోబో హోటల్ అంటే ఎక్కడెక్కడో వెతుక్కోవాలని అనుకునే వాళ్ళం. ఇప్పుడు మాత్రం మన దేశంలో ప్రముఖ పట్టణాలలో రోబో సర్వీసులు మొదలయ్యాయి. తాజాగా ఒడిస్సా లోని తొలి రోబో హోటల్ రెడీ అయింది. భువనేశ్వర్ లోని ఓ రెస్టారెంట్లో వెయిటర్ల బదులు రెండు ఇండియన్ రోబోలు దర్శనం ఇవ్వనున్నాయి. అయితే చక్కగా స్వాగతిస్తూ కస్టమర్లకు కావలసినవన్నీ అందిస్తున్న ఈ రోబోలకు చంప, చమేలి అని పేర్లు పెట్టారు. రోబోలతో వినూత్నంగా ఉండటంతో ఈ రెస్టారెంట్‌కు డిమాండ్ పెరిగింది. అయితే మూడు గంటలపాటు ఛార్జింగ్ పెడితే చాలు ఈ రోబోలు 24 గంటల పాటు పని చేస్తాయి. ప్రస్తుతం ఈ రోబోలు వెయిటర్లుగా ఉన్న రెస్టారెంట్‌లు చెన్నై, కోయంబత్తూర్‌, శివమొగ్గలోనూ ఉన్నాయి. ఇప్పుడు భువనేశ్వర్లో ఈ హోటల్ ప్రారంభం అయ్యింది. రెస్టారెంట్ కి వెళ్ళగానే ఎదురు వచ్చి, గుడ్ మార్నింగ్‌.. గుడ్ ఈవెనింగ్ చెప్పేసి, ఆర్డర్ తీసుకు వచ్చే ఈ రోబోలను చూడటానికి జనం ఉత్సాహంగా తరలివెళ్తున్నారు. అందులోను ఈ రోబోలు అన్ని భాషల్లోను మాట్లాడుతూ ఉండటం ప్రత్యేక ఆకర్షణ.. . హోటల్లో తినడానికంటే కూడా ఈ రోబోను చూడటానికి ఎక్కువ మంది జనం వస్తారు అనడంలో ఆశ్చర్యం లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.