ఎస్.బి.ఐ ఏటిఎంలలో రూ.2000 నోట్లు బంద్..!త్వరలో అమల్లోకి..!

By Newsmeter.Network  Published on  9 Oct 2019 9:34 PM IST
ఎస్.బి.ఐ ఏటిఎంలలో రూ.2000 నోట్లు బంద్..!త్వరలో అమల్లోకి..!

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.2 వేల కరెన్సీ నోటును అందుబాటులోకి తెచ్చారు.. అయితే.. రూ .2000 నోట్ వచ్చినప్పటి నుంచి ప్రజలకు చిల్లర కష్టాలు మొదలయ్యాయి. మామూలుగా రూ.500 ఉంటేనే చిల్లర దొరకడం కష్టం... అలాంటిది రూ. 2000 నోటుతో చిల్లర దొరక్క అష్టకష్టాలు పడ్డారు ప్రజలు.

అయితే.. క్రమక్రమంగా రెండు వేల రూపాయలు నోటు వాడకం తగ్గితూ వస్తుంది ప్రభుత్వం. ఈ మేరకు దేశంలో ప్రజలందరికీ ఎక్కువ మొత్తంలో సేవలందిస్తున్న ఎస్‌బీఐ బ్యాంక్ రూ.2000 నోట్ ని ఏటీఎంల నుంచి తొలగించనుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ సూచనలతో ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.ఎస్‌బీఐ కి సంబంధించిన అన్ని ఏటీఎంల నుండి రూ.2000 క్యాసెట్లను తొలగించనుంది ఎస్‌బీఐ.

అంతేకాదు.. త్వరలోనే రూ.500 నోటును కూడా ఏటీఎంల్లో ఆపేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.. కేవలం రూ.200, రూ.100 నోట్లు మాత్రమే ఇక ఎస్‌బీఐ ఏటీఎంల ద్వారా పొందే వీలుంటుందన్నమాట. మరోవైపు ఏటీఎంల్లో చిన్ననోట్లు మాత్రమే లభ్యం కానుండడంతో.. ఏటీఎంల్లో ఫ్రీ లావాదేవీల పరిమితిని పెంచే యోచనలో కూడా బ్యాంకు ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story