ఎన్టీఆర్ అభిమానుల‌ను నిరాశ ప‌రిచిన 'ఆర్ఆర్ఆర్' టీమ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2020 1:50 PM IST
ఎన్టీఆర్ అభిమానుల‌ను నిరాశ ప‌రిచిన ఆర్ఆర్ఆర్ టీమ్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'‌(రౌద్రం ర‌ణం రుధిరం). ద‌ర్శ‌దీరుడు రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా.. రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజు గా న‌టిస్తున్నారు. అభిమానుల అంచ‌నాల‌కు మించి ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తోంది. కాగా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా ప‌డింది.

రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్ర‌త్యేక టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రంపై అంచ‌నాలు రెట్టంపు అయ్యాయి. సీతారామరాజు గా చరణ్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేసిన తీరు ఫ్యాన్సును అల‌రించింది. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తుంద‌ని అభిమానులు ఎంతో ఆశ‌గా ఉన్నారు. కానీ ఆ రోజు ఎలాంటి వీడియోను విడుద‌ల చేయ‌డం లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో వెల్ల‌డించింది.

లాక్‌డౌన్‌ పలుమార్లు పొడిగించడంతో చిత్రానికి సంబంధించిన అన్ని పనులు నిలిచిపోయాయ‌ని, ఎంతగా ప్రయత్నించినప్పటికీ తారక్‌ బర్త్‌డే ట్రీట్‌ ఇవ్వలేకపోతున్నామ‌ని, కావున, ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మేము ఎలాంటి ఫస్ట్‌ లుక్‌ గానీ, వీడియో గానీ విడుదల చేయడం లేదని పేర్కొంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందారు.



Next Story