ఎన్‌ఆర్సీపై సంచలన ప్రకటన చేసిన సీఎం జగన్‌

By సుభాష్  Published on  23 Dec 2019 6:35 PM IST
ఎన్‌ఆర్సీపై సంచలన ప్రకటన చేసిన సీఎం జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఎన్‌ఆర్సీ బిల్లుపై సంచలన ప్రకటన చేశారు. ఎన్‌ఆర్సీ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు పలకబోమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్‌ పాషా ఇటీవల వ్యాఖ్యలు చేశారని,ఆ వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్‌ తమ ప్రభుత్వం ఈ బిల్లుకు వ్యతిరేకమని, రాష్ట్రంలో ఈ బిల్లు అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. ఈరోజు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా జగన్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఎన్‌ఆర్సీపై వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్సీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నవిషయం తెలిసిందే. ముఖ్యంగా మైనార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై డిప్యూటీ సీఎం అంజాద్‌ తనతో చర్చించిన తర్వాతే ఇటీవల ప్రకటన చేశారని పేర్కొన్నారు. తామంతా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు

ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా వైసీపీ లోక్‌సభతో పాటు, రాజ్యసభలోనూ ఓటు వేసింది.ఈ నేపథ్యంలో ఏపీలో మద్దతుదారులుగా ఉన్న ముస్లింలు జగన్‌ఫైనే వ్యతిరేకత చూపించారు. దీంతో ఎన్‌ఆర్సీ, సీఏబీకి ఏపీ సర్కార్‌ మద్దతు ఇవ్వబోదని డిప్యూటీ సీఎం ప్రకటన చేశారు.

Next Story