సినిమా ఏదైనా గానీ..ఈ మధ్య కాస్త రొమాన్స్ ఉంటేగానీ చూడట్లేదు ప్రేక్షకులు. కొందరు అతిగా చూపిస్తుంటే..మరికొందరు కాస్త లిమిటెడ్ గా చూపిస్తుంటారు. అయితే..ఇకపై సీరియల్స్ లో వచ్చే కిస్సింగ్ సీన్లను బ్యాన్ చేయాలని తైవాన్ ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు కారణం కరోనా వైరస్ అంటే నమ్ముతారా ? నిజమండి..చైనాలోని వూహాన్ పట్టణంలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం మనిషిని మనిషి తాకడం ద్వారానే వ్యాప్తిచెందుతుందని తెలిశాక అంతా ఖంగుతిన్నారు. అప్పటి నుంచి కరోనా పేషెంట్ అంటే చాలు…అంటరానివారిని చూసినట్లు చూస్తున్నారు.

కరోనా టెన్షన్ తోనే సీరియల్స్ లో కిస్ సీన్స్ ఉండకూడదని తైవాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్కడి మీడియా కథనం ప్రకారం షూటింగ్ సమయంలో ఎవరూ మాట్లాడుకోకూడదని, వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా తైవాన్ నటి చీవూ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతిఒక్కరూ ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.