తిరుమల కొండపై విమానం చక్కర్లు.. భక్తుల ఆగ్రహం..

By అంజి  Published on  5 Feb 2020 5:43 AM GMT
తిరుమల కొండపై విమానం చక్కర్లు.. భక్తుల ఆగ్రహం..

తిరుపతి: తిరుమల కొండపై ఓ ఛార్టెడ్‌ విమానం హల్‌చల్‌ చేసింది. కేంద్రానికి చెందిన సర్వే ఆఫ్‌ ఇండియా విమానం రెండు రోజులుగా తిరుమల కొండపై చక్కర్లు కొట్టింది. ఇప్పటికే తిరుమలపై నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించారు. అయిన ఆ విమానం కేంద్రానికి చెందినదని తెలియక తిరుమల అధికారులను కలవరపాటుకు గురయ్యారు. ఎం జరుగుతుందో తెలియక భద్రతా సిబ్బంది అయోమయానికి లోనయ్యారు.

ఎస్‌వోఐకి చెందిన విమానం ప్రతి ఐదేళ్లకొకసారి దేశ భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సర్వే చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన తిరులమ విజిలెన్స్‌ అధికారులు వెంటనే చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం అందించారు. తిరుమల కొండపైకి విమానాలను పంపబోమని ఏటీసీ అధికారులు తెలిపారని విజిలెన్స్‌ వీజీవో మనోహర్‌ తెలిపారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి వెంకటేశ్వర విమానానికి ఎగువన విమానాలు వెళ్లకూడదనే ఓ నియమం ఉంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తిరుమల కొండపై విమానాలు తిరగరాదని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల కొండపై విమానాల తింపకూడదని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాంతంలో దేవతలు విహరిస్తుంటారని తిరుమల భక్తుల నమ్మకం. కొండ ప్రాంతంలో పాజిటివ్‌ రేస్ ఉండడంతో.. గతంలో బ్రిటీష్‌కు చెందిన విమానాలు పేలిపోయానని అధికారులు చెబుతున్నారు. కాగా కొండపై నుంచి విమానం వెళ్లడాన్ని చూసిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాణాల ప్రకారం శ్రీవారి ఆలయ గగనతలంపై లోహపు వస్తువుల ఎగరకూడదని పండితులు ఎప్పటి నుంచో చెబుతూవస్తున్నారు.

Next Story