స్పెయిన్‌ ఆస్పత్రుల్లో వృద్ధులకు నో ఎంట్రీ.. తిప్పిపంపేస్తున్నసిబ్బంది

By Newsmeter.Network  Published on  5 April 2020 8:29 AM GMT
స్పెయిన్‌ ఆస్పత్రుల్లో వృద్ధులకు నో ఎంట్రీ.. తిప్పిపంపేస్తున్నసిబ్బంది

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఈ వైరస్‌ దాటికి ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇటలీ, చైనా, బ్రిటన్‌ వంటి దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. స్పెయిన్‌లో కూడా కరోనా వైరస్‌ కరతాళనృత్యం చేస్తుంది. వైరస్‌ సోకి ఆస్పత్రులకు చేరుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. సామర్థ్యానికి మించి రోగుల్ని చేర్చుకుంటున్నా అక్కడి వైద్యులు తగినంత మందికి చికిత్స అందించలేక పోతున్నారు.

Also Read :కళ్ల కలకుంటే.. కరోనా ప్రమాదం పొంచిఉన్నట్లే…

దీంతో వైద్యం కోసం వస్తున్న 60ఏళ్లు దాటిన వారిని తిప్పిపంపేస్తున్నారు. ఉన్న ఐసీయూలను మధ్య వయస్కులు, యువతకు ఉపయోగించాలనే ఉద్దేశంతోనే వృద్ధులను తిప్పిపంపుతున్నామని అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 1,26,168 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించగా, 11,947 మంది ఈ మహమ్మారి భారినపడి మృతిచెందారు. ఇదిలాఉంటే వైరస్‌ వ్యాధి అంతకంతకూ పెరుగుతుండటంతో దీని భారిన పడుతున్న వృద్ధుల సంఖ్య అధికంగా ఉంటుంది. దీంతో కేర్‌ హోమ్స్‌లోనూ పరిస్థితి హృదయవిధారకంగా మారినట్లు తెలుస్తోంది. వృద్ధుల యోగక్షేమాలు చూసుకునేందుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో అనేక మంది వారున్న మంచాలపైనే ప్రాణాలు విడుస్తున్న ఘోర పరిస్థితులు స్పెయిన్‌లో కనిపిస్తున్నాయి.

Also Read : లాక్‌డౌన్‌ పొడిగింపు ఖాయమా.. కారణం అదేనా?

Next Story