హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ఉండవని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన ప్రతిసారి సంస్థకు కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. ఈ సమ్మెతో కూడా ఇప్పటి వరకు రూ.150 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. గుడువులోగా కార్మికులు విధుల్లో చేరకపోతే తీసుకోమన్నారు. త్వరలోనే ఆర్టీసీలో కొత్త ఉద్యోగాలకు నోటీఫికేషన్ జారీ చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా సర్వీసులు పెంచాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తక్షణమే ఆర్టీసీకి ఎండీని నియమించాలన్న హైకోర్టు ఆదేశాలను సీఎం కేసీఆర్ లైట్ తీసుకున్నారు. సమ్మె జరుగుతున్న సమయంలో కుదరదని అధికారులతో చెప్పారు.

ఆర్టీసీ కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తున్నప్పటికీ వారు సమ్మె బాట పట్టడం అన్యాయం అన్నారు. 44 శాతం పిట్ మెంట్, 16 శాతం ఐఆర్‌ ఇచ్చి బాగా చూసుకున్నామన్నారు. సమ్మె విషయంలో తాను కఠినంగానే ఉంటానని సీఎం కేసీఆర్‌ మంత్రులు, అధికారులతో అన్నట్లు సమాచారం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.