జమ్మూ: ఉగ్రవాదుల కాల్పుల్లో బలైన నిజామాబాద్‌ జిల్లా జవాను

By సుభాష్  Published on  9 Nov 2020 2:46 AM GMT
జమ్మూ: ఉగ్రవాదుల కాల్పుల్లో బలైన నిజామాబాద్‌ జిల్లా జవాను

జమ్మూ కశ్మీర్‌లో నిన్న ఉగ్రవాదులకు, జవాన్లకు ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఈ కాల్పులు నిన్నటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులు కాగా, ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అయితే కుప్వారా జిల్లా మచిల్‌ సెక్టార్‌ ప్రాంతంలో ముష్కరులపై జరిగిన పోరులో అసువులు బాసిన భారత జవాన్లు నలుగురిలో తెలంగాణకు చెందిన మహేష్‌ కూడా ఉన్నారు.

ఉగ్రమూకలపై తన పోరును కొనసాగించి వీరమరణం చెందిన ఆర్‌.మహేష్‌ స్వస్థలం నిజామాబాద్‌ జిల్లా కోమన్‌పల్లి. గత సంవత్సరమే మహేష్‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 8 నెలల కిందట సైన్యంలో చేరిన మహేష్‌.. ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం చెందిన ఆ కుటుంబాన్ని విషాదంలో నెట్టేసింది. చిన్నతనం నుంచి చురుకుగా ఉండే మహేష్‌కు సైన్యంలో చేరాలన్న లక్ష్యంతో కుటుంబ సభ్యులను ఒప్పించి అందులో చేరాడు. మహేష్‌ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించనున్నారు.

Next Story
Share it