కరోనా ఎఫెక్ట్.. నితిన్ పెళ్లి వాయిదా
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో తెలిపాడు.
ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో మార్చి 30న తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు నిర్వహించకూడదని విజ్ఞప్తి చేశాడు. తన పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సమాధానం ఇచ్చాడు. ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి సన్నాహాకాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో వైరస్ ప్రపంచమంతా విస్తరించడంతో పెళ్లికి సరైన సమయం కాదని వాయిదా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడివున్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడదని లాక్‌డౌన్ కాలంలో మార్చి 30వ తేదీ నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు జరపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంతే కాదు, లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16వ తేదీ జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనమందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో మనం కాలు మీద కాలేసుకొని కూర్చుని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు. ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ.. నితిన్’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.