కిసాన్‌ కార్డుదారులకు రూ. 25వేల కోట్లు: మంత్రి నిర్మలాసీతారామన్‌

By సుభాష్  Published on  14 May 2020 11:47 AM GMT
కిసాన్‌ కార్డుదారులకు రూ. 25వేల కోట్లు: మంత్రి నిర్మలాసీతారామన్‌

భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల కిందట జాతినుద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ప్యాకేజీ స్వయంసమృద్ది, ఆర్థిక నిర్మాణానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూ.20 లక్షల క ఓట్ల ప్యాకేజీ గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ వివరాలు వెల్లడించారు.

ఆత్మ నిర్బర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా గురువారం 9 విభాగాల కేటాయింపులను మంత్రి నిర్మలాసీతారామన్‌ మీడియాకు వెల్లడించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారాలు, స్వయం ఉపాధి,చిన్నకారు, సన్నకారు రైతులు, ముద్రయోజన, హౌజింగ్‌, ఉద్యోగ కల్పన తదితర అంశాలకు సంబంధించిన కేటాయింపులు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31వ తేదీ వరకూ రాయితీ పొడిగిస్తున్నట్లు చెప్పారు.

సన్నకారురైతులకు తక్కువ వడ్డీకే రేణాలు, గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కిసాన్‌ కార్డు దారులకు రూ. 25 వేల కోట్ల రుణాలు, దేశంలో 3 కోట్ల మంది రైతులకు రూ.4,22 లక్షల కోట్ల రుణాలు ఇప్పటికే మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు.

రుణాలపై మూడు నెలల మారటోరియం

ఇక రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం కల్పిస్తున్నామని అన్నారు. రతులకు రూ.25 లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల అందజేశామని, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు మార్చి నెలలో రూ.29,500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసినట్లు ఆమె చెప్పారు. అయితే ఇంతటితోనే వ్యవసాయ రంగానికి సాయం అందించే అంశం ముగిసినట్లు కాదని స్పష్టం చేశారు.

అలాగే వలస కార్మికులు ఉన్న ప్రాంతంలోనే కొత్తగా రిజిస్టేషన్‌ చేసుకుని ఉపాధి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం 30 శాతం మందికే కనీసం అందుతోందని, దీన్ని స్వార్వజనీనం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అలాగే దేశమంతా ఒక్కటే కనీస వేతనం ఉండేలా చేస్తున్నామన్నారు.

వలస కార్మికులందరికీ ఏజన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకునేలా వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు. సంస్థలు, పరిశ్రమలన్నీ నేరుగా కార్మికులను నియమించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, పది మందికిపైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిస్తామన్నారు.

ఇక దూర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్తున్న కార్మికులకు నైపుణ్యం పెంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ కింద రాష్ట్రాలకు రూ. 11,002 కోట్లు కేటాయిచినట్లు ప్రకటించారు.

Next Story