నిరీక్షణ ప్రమోషనల్‌ సాంగ్‌ ‘రాక్షస..’కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 10:17 AM GMT
నిరీక్షణ ప్రమోషనల్‌ సాంగ్‌ ‘రాక్షస..’కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌

టేక్‌ ఓకే క్రియేషన్స్‌ పతాకంపై, వంశీకష్ణ మళ్ళ దర్శకత్వంలో.. పి.రాజన్‌ నిర్మిస్తున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నిరీక్షణ’. ఈ చిత్రంలో సాయిరోనక్‌, ఎనా.. సహా జంటగా నటిస్తున్నారు. మొదటి సారి ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి తనయుడు, హీరో జీవా సోదరుడు రమేష్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. దీపావళి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు.. ప్రమోషనల్‌ సాంగ్‌ 'రాక్షస'.. విడుదల చేశారు. ఈ 'రాక్షస' సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ సందర్భంగా దర్శకుడు వంశీకృష్ణ మళ్ళ మాట్లాడుతూ:

మా సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌ 'రాక్షస..'కు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్‌.బి.చౌదరి తనయుడు రమేష్‌ ఈ సినిమాలో మెయిన్‌ విలన్‌గా చాలా అద్భుతమైన క్యారెక్టర్‌ చేశారు. శ్రద్ధా దాస్‌, సనా.. స్పెషల్‌ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌, మధుసూదన్‌, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి, సంగీతం: మంత్ర ఆనంద్‌, పాటలు: చంద్రబోస్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, నిర్మాణం: టేక్‌ ఓకే క్రియేషన్స్‌, దర్శకత్వం: వంశీకృష్ణ మళ్ళ.

Next Story
Share it