చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి.. నిర్భయ దోషుల తల్లిదండ్రులు..

By అంజి  Published on  16 March 2020 7:07 AM GMT
చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి.. నిర్భయ దోషుల తల్లిదండ్రులు..

ఢిల్లీ: నిర్భయ దోషుల కుటుంబ సభ్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలని వారు ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు. నిర్భయ నిందితుల తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు అందరూ కలిసి ఈ రాష్ట్రపతికి ఈ లేఖ రాశారు. కారుణ్య మరణం ప్రసాదించేందుకు రాష్ట్రపతిని, నిర్భయ తల్లిదండ్రులను కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. నిందితుల కుటుంబ సభ్యులు 13 మంది లేఖలో సంతకం చేశారు. ఇక 13 మందిలో ఇద్దరు ముఖేష్‌ కుటుంబానికి చెందిన వారు కాగా, నలుగురు పవన్‌, వినయ్‌ కుటుంబానికి చెందిన వారు, అక్షయ్‌ కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు.

Nirbhaya convicts families

నిర్భయ దోషులకు నాలుగో సారి డెత్‌ వారెంట్‌ జారీ అయింది. ఈనెల 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఢిల్లీ పటియాల హైస్‌ కోర్టు తీర్పునిచ్చింది. నలుగురు దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తయ్యాయి. ఇప్పటికే మూడు సార్లు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్టు.. దోషుల వివిధ రకాల పిటిషన్ల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు నాలుగో సారి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. మరి ఇప్పుడైనా ఉరి అమలు అవుతుందా..? లేదా? అనేది వేచి చూడాలి.

కాగా, 2012, డిసెంబర్‌ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులో ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సింగపూర్‌ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చివరకు కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు నిర్భయగా నామకరణం చేశారు.

ఈ ఘటనలో నిందితులైన, వినయ్‌, రామ్‌ సింగ్‌, అక్షయ్‌కుమార్‌, పవన్‌, ముఖేష్‌, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్‌ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్‌గా భావించి మూడు సంతవ్సరాల పాటు జైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది.

Next Story