నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి

By Medi Samrat  Published on  1 Nov 2019 8:05 AM GMT
నిర్భయ దోషులకు త్వరలోనే ఉరి

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలు చేస్తామన్న తీహార్ జైలు అధికారుల ప్రకటనపై బాధితురాలి తల్లి స్పందించారు. ఇది ఎప్పుడో జరగాల్సిందని.. ఇప్పటికైనా శిక్ష అమలు చేయాలని కోరారు. 16 డిసెంబర్ 2013న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ సామూహిక అత్యాచార ఘటనలో దోషులు ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్ లకు విధించిన మరణశిక్షను అమలు చేస్తున్నామని తీహార్ జైలు అధికారులు ప్రకటించారు. దోషులకు కూడా ఈ సమాచారాన్ని అందజేశామన్నారు. నిర్ణీత తేదీలోపు ఆపరాధులు క్షమాభిక్ష కోరడమో.. సవాల్ చేయడమో చేయకపోతే అదే విషయాన్ని సంబంధిత కోర్టుకు తెలియజేస్తారు. అనంతరం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మరణశిక్ష అమలు చేస్తారు.

7సంవత్సరాల క్రితం నిర్భయ కేసు దేశంలో కలకలం రేపింది. నిర్భయపై నిందితులు దారుణంగా ప్రవర్తించారు. గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దిగువ కోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే శిక్ష అమలులో జాప్యం జరుగుతూనే ఉంది. మరణ శిక్షను సవాల్ చేసే హక్కు దోషులకు ఉన్నప్పటికీ. నలుగురిలో ఎవరు దరఖాస్తు చేయలేదని తెలుస్తోంది. నిర్భయ నిందితులు నలుగురిలో ముగ్గురు తీహార్ జైల్లో ఉండగా.. నాలుగో వ్యక్తి మండోలి జైల్లో ఉన్నాడు.

Next Story