నిర్భయ నిందితుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా

By రాణి  Published on  31 Jan 2020 12:13 PM GMT
నిర్భయ నిందితుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా

నిర్భయ కేసులో నలుగురు నిందితుల ఉరి శిక్ష పై ఢిల్లీ పటియాల కోర్టు స్టే ఇచ్చింది. తెల్లవారితే నలుగురు నిందితుల్ని ఉరి తీయాల్సి ఉండగా పటియాలా కోర్టు నిందితుల డెత్ వారెంట్ పై స్టే ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలవుతుందన్న ఆనందాన్ని అణచివేసింది. ఇప్పటికి నాలుగు సార్లు నిందితులకు ఉరిశిక్ష వాయిదా పడింది. కాగా..కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంక వరకూ ఉరిశిక్ష వాయిదా వేయాల్సిందిగా పటియాలా కోర్టు తెలిపింది.

నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ కేసు దాఖలయ్యే నాటికి తాను మైనర్ నని, తనకు ఉరిశిక్ష నుంచి వెసులుబాటు కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇక నిందితుల ఉరికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మిగిలింది ఉరితీయడమే అనుకుంటున్న సమయంలో పటియాలా కోర్టు డెత్ వారెంట్ పై స్టే విధించింది. వినయ్ శర్మ క్షమాభిక్ష కోరుతూ రాష్ర్టపతికి చేసిన మెర్సీ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉండటం వల్ల శిక్షను వాయిదా వేశారా ? లేక మరో వారం రోజుల్లో ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఉరిశిక్షను వాయిదా వేశారా ? ఇలా పిటిషన్లు వేయించి, శిక్షను వాయిదా వేస్తూ...నిందితులకు ఉరిశిక్ష పడకుండా చేసి...కేసు నుంచి బయటకు తెచ్చేందుకే ఈ హైడ్రామానా ? అని ఎన్నో అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఉరిశిక్ష సమయం దగ్గరపడుతున్నా నిందితుల్లో అణువంతైనా భయం లేదని జైలు అధికారులు చెప్పిన మాటలే నిజమయ్యాయి. వారు ఊహించినట్లే..ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. రాష్ర్టపతి వద్ద పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగానే శిక్ష వాయిదా పడితే...మరో 14 రోజుల తర్వాతే నిందితులను ఉరి తీయాల్సి ఉంటుంది. కాగా..డెత్ వారెంట్ పై స్టే ఇచ్చిన కోర్టు మాత్రం ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణం వెల్లడించ లేదు.

https://telugu.newsmeter.in/nirbhaya-life-story/

Next Story