ఉరి తాళ్లు సిద్ధం చేయండి: సుప్రీం కోర్టు

By Newsmeter.Network  Published on  9 Dec 2019 6:16 PM IST
ఉరి తాళ్లు సిద్ధం చేయండి: సుప్రీం కోర్టు

నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరివేసేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2012 డిసెంబర్‌ 15న నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు ఏడేళ్లవుతున్నా.. నిందితులకు ఎలాంటి శిక్ష వేయలేదు. ఆరుగురు నిందితులు నడుస్తున్న బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పట్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అందులో ఒక నిందితుడు జైలులోని ఆత్మహత్యకు పాల్పడగా, మరో నిందితుడిని మైనర్‌గా భావించి జైలుశిక్ష విధించి బాలనేరస్థుల జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక మిగిలిన నలుగురు నిందితులకు బీహార్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది.

అందులో వినయ్‌ శర్మ అనే నిందితుడు క్షమాభిక్ష కింద రాష్ట్రపతికి పిటిషన్‌ దాఖలు చేయగా, అందుకు ఢిల్లీ ప్రభుత్వం, గవర్నర్‌ తిరస్కరించి రాష్ట్రపతికి పంపించారు. రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదని ఇప్పటికే రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ స్పష్టం చేశారు. కాగా, కోర్టు బీహార్‌లోని బక్సర్‌ జైలుకు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిందితులకు ఈనెల 16న ఉరి శిక్ష వేసేందుకు ఏర్పాట్లు చేయాలని, 14వ తేదీ వరకు 10 ఉరితాళ్లను సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అందుకు అధికారులు కూడా దోషులకు ఉరివేసేందుకు ఉరితాళ్లను సిధ్దం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఉరిశిక్ష అమలును వాయిదా వేసేందుకు దోషులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.సుప్రీం కోర్టులో కూడా రివ్యూ పిటిషన్‌ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

Next Story