ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా మరణాలు అధికమవుతున్నాయి. తాగాజా భారత్‌కు పాకిన ఈ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే కరోనా మరణాలు 8కి చేరగా, తాజాగా సోమవారం మరో  కరోనా మరణం సంభవించింది. ఇక భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 9కి చేరింది. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య  400పైగా దాటిపోయింది. కోల్‌కతాకు చెందిన 55 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మరణించాడు.

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 13వేలకుపైగా చేరాయి. 3 లక్షలకుపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో పాజిటివ్‌ కేసులు 33కు చేరుకున్నాయి.  ఈ ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.