ప్రాణం తీసిన బంతి..

 Published on  9 Feb 2020 12:58 PM GMT
ప్రాణం తీసిన బంతి..

ఓ బాలుడికి టెన్నిస్‌ బంతి పై ఉన్న ఆశనే అతని ప్రాణాన్ని బలిగొలింది. టెన్నిస్‌ కోర్టులో బంతిని తెచ్చుకునేందుకు వెళ్లిన ఆ బాలుడు తిరిగి రాలేడు. బంతి కోసం వెళ్లిన బాలుడు విద్యుత్‌ షాక్‌ గురై మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకుంది.

దుర్గా భవానీ నగర్‌ కు చెందిన అఖిల్ అనే బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఫిలింనగర్‌ కల్చరల్ సెంటర్‌లోని టెన్నిస్‌ కోర్టుకు వెళ్లాడు. ఎవ్వరికి తెలియకుండా బంతులు తీసుకొనిరావాలని అనుకున్నాడు. ఎంఆర్‌సీ కాలనీవైపు ఉన్న గోడమీద నుంచి టెన్నిస్‌ కోర్టులోకి వెళ్లాడు. నాలుగు టెన్నిస్‌ బంతులను తీసుకుని బయటకు వచ్చే క్రమంలో కరెంట్ షాక్‌ తగిలి గోడపైనే మృతి చెందాడు. బాలుడు తండ్రి ఐదునెలల క్రితమే మృతి చెందగా.. తల్లి ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

Next Story
Share it