మూడు ముళ్లు వేసిన హీరో నిఖిల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 May 2020 3:54 AM GMT
మూడు ముళ్లు వేసిన హీరో నిఖిల్..!

టాలీవుడ్ నటుడు నిఖిల్ తను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మ మెడలో మూడుముళ్లు వేశాడు. హిందూ సంప్రదాయం ప్రకారం శామిర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య నిఖిత్, పల్లవి వర్మల వివాహం నిర్వహించారు. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేశాడు నిఖిల్. పెళ్లి కొడుకు రెడీ అంటూ గత రాత్రి ఫోటోలు పెట్టగా.. ఈరోజు ఉదయం వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. నిఖిల్ కు చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. మే 14న ఉదయం 6 గంటల 31 నిమిషాలకు నిఖిల్, పల్లవి వర్మల వివాహం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో కొందరు సన్నిహితుల మధ్య ఎంగేజ్ మెంట్ జరిగింది.

Nikhil

నిఖిల్ పెళ్లి ఏప్రిల్ 16నే పెళ్లి జరగాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో మే 14న పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. నిఖిల్ తన పెళ్లిని చాలా గ్రాండ్ గా జరుపుకోవాలని అనుకుని ఏప్రిల్ 16న పెళ్లి చేసుకోవాలనకున్నాడు. దాదాపు 5000 మంది నిఖిల్ పెళ్ళికి హాజరయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు అన్నారు. అప్పటికే చాలా ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి. కానీ లాక్ డౌన్ ప్రభావంతో పెళ్లి వాయిదా పడింది. దీంతో మే 14న ముహూర్తం పెట్టుకున్నారు. ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా నిఖిల్ పెళ్లి పూర్తీ అయింది.

Next Story