నిజామాబాద్ బాక్సర్ నిఖత్.. మేరీకోమ్ ని దాటగలదా?

By Newsmeter.Network  Published on  27 Dec 2019 8:30 AM GMT
నిజామాబాద్ బాక్సర్ నిఖత్.. మేరీకోమ్ ని దాటగలదా?

ముఖ్యాంశాలు

  • న్యూఢిల్లీలో ఒలంపిక్స్ బాక్సింగ్ సెలక్షన్స్
  • నిఖత్ జరీన్ కీ మేరీకోమ్ కీ మధ్య గట్టి పోటీ
  • మేరీకోమ్ ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్
  • మోరీకోమ్ ని అధిగమించగలిగితే నిఖత్ కి ఛాన్స్
  • వయసు జరీన్ కి అడ్వాంటేజ్ అవుతుందని అంచనా
  • మేరీకోమ్ వైపే మొగ్గుచూపుతున్న సెలక్షన్ కమిటీ

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కి ఆరుసార్లు ప్రపంచం ఛాంపియన్ గా నిలిచిన మేరీ కోమ్ కీ మధ్య బలమైన పోటీ. అవును మీరు వింటున్నది, చదువుతున్నదీ నిజమే. కానీ నేరుగా వీళ్లిద్దరూ రింగ్ లో పోటీ పడడం లేదు. దానికి మరో అంచును దాటాల్సి ఉంది. ఒలంపిక్స్ కి అర్హత సాధించేందుకు జరుగుతున్న పోటీల్లో వీళ్లిద్దరూ బరిలో ప్రాథమికంగా పోటాపోటీగా నిలిచారు.

న్యూఢిల్లీలో ఒలంపిక్స్ కు పంపే బాక్సర్ల సెలక్షన్స్ జరుగుతున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సెలక్క్షన్స్ లో తొలి రోజున నిఖత్ హర్యానాకు చెందిన జ్యోతితో పోటోపడుతోంది. ఇదే సమయంలో ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ రీతూ గ్రేవల్ ని ఎదుర్కుంటోంది.

నిఖత్ ఈ బౌట్ లో విజయం సాధిస్తే నేరుగా మేరీకోమ్ ని ఎదుర్కునే అవకాశం కలుగుతుంది. అప్పుడు ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్లు ఒలంపిక్స్ కి క్వాలిఫై అవుతారు. ఒలంపిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసలు ఎలాంటి పోటీ లేకుండానే మేరీకోమ్ ని ఒలంపిక్స్ కి ఎంపిక చేయాలని భావిస్తోంది. కానీ సెలక్షన్ ప్రొసీజర్ అనివార్యం కావడంతో ఇప్పుడు పోటీ మరింతగా పెరిగింది. ఈ దశలో నిఖత్ పై ఒత్తిడి చాలా ఉంది.

నిఖత్ పూర్వ కోచ్ చిరంజీవి మాత్రం తన శిష్యురాలు ఈ బౌట్ లో నెగ్గి మేరోకోమ్ ని ఎదుర్కుని ఒలంపిక్స్ కి అర్హత సాధిస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. నిఖత్ నిజామాబాద్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని నమ్మకంగా చెబుతున్నారు. గతంలో నిఖత్ మేరీకోమ్ తో మూడుసార్లు ఫైట్ చేసింది. ఆ అనుభవంతో ఇప్పుడీ సెలక్షన్స్ లో నిఖత్ ముందంజలో ఉంటుందని చిరంజీవి ఆశిస్తున్నారు.

మోరీకోమ్ తో పోలిస్తే నిఖత్ కి వయసు అడ్వాంటేజ్ అవుతుందని చిరంజీవి భావిస్తున్నారు. ప్రస్తుతం నిఖత్ వయసు 23. ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ వయసు 36 సంవత్సరాలు. అనుభవం రీత్యా మేరీకోమ్ ముందంజలో ఉన్నా, వయసులో మాత్రం నిఖత్ కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది ఆయన ఆలోచన. కచ్చితంగా మెరుపువేగంతో దాడి చేయడానికి వయసు ఒక ప్రధానమైన బలమైన అంశంగా పోటీలో సహకరిస్తుందని చెబుతున్నారాయన.

Next Story