నిహారిక పెళ్లి.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన
By సుభాష్ Published on 17 May 2020 4:29 PM ISTసోషల్ మీడియాలో నిహారిక కొనిదెల పెళ్లిపై వస్తున్న వార్తలపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అయితే కొణిదెల నిహారిక పెళ్లిపై సోషల్ మీడియాలో రోజుకో వార్త పుకార్లు షికార్లు చేస్తోంది. ఈ మధ్య సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్లి చేసుకుంటున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ పుకార్లన్నీ అబద్దమని స్పష్టమైపోయింది. ఆ తర్వాత ప్రభాస్‌తో నిహారిక పెళ్లి అంటూ మరో వార్త నెట్టింట్లో హల్‌చల్ చేసింది. దీనిపై కూడా నిహారిక క్లారిటీ ఇచ్చేసింది. తాను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది.
ఇక తాజాగా నిహారిక పెళ్లిపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందించారు. ఆమె వివాహం ఎప్పుడన్నది క్లారిటీ ఇచ్చారు. నిహారికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, వచ్చే ఏడాదిలో ఆమె పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. అంతేకాదు వరుణ్‌తేజ్‌కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచన ఉందన్నారు. వచ్చే ఏడాది చివరిలోగానీ, 2022లో గానీ వరుణ్ పెళ్లి చేసే ఆలోచన ఉందన్నారు. ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు చెప్పారు. పిల్లల పెళ్లిళ్లు అయిపోతే బాధ్యత తీరిపోతుందని చెప్పారు. వరుణ్‌తేజ్‌ను ఐపీఎస్‌గా, నిహారికను డాక్టర్‌గా చూడాలనే కోరిక ఉండేదని, నిహారిక సినిమాల్లోకి వస్తానంటే కాదని చెప్పలేకపోయానని చెప్పుకొచ్చారు.
కాగా, ఈ మధ్యనే సోషల్ మీడియా వేదికగా ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నారు. ఉన్నది లేనిది.. లేదని ఉన్నదిగా పుకార్లు షికార్లు అవుతున్నాయి. దీంతో సెలబ్రిటీల పెళ్లిళ్ల విషయంలో కూడా అనేక వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దృష్టి సారించిన నాగబాబు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.