సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకు ఉగ్రవాదులు దాడులకు తెగబడటంతో 71 మంది సైనికులు ప్రాణాలు విడిచారు. మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నైజీరియాలోని నైజర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తిల్లబెరి ప్రాంతంలో రెండు రోజుల కిందటనే వందల సంఖ్యలో ఉగ్రవాదులు చోరబడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ బేస్ క్యాంపులపై ఉగ్రవాదులు దాడికి దిగారు.  దీంతో అప్రమత్తమైన సైనికులు ప్రతిదాడులకు దిగారు.  ఈక్రమంలో కొందరు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలుస్తోంది.

మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో వందలమంది ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో  71 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. మరికొందరి ఆచూకి లభ్యం కాలేదు. తీవ్ర గాయాలపాలైన సైనికులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య దాదాపు మూడు గంటల పాటు.. భీకర కాల్పులు జరిగాయని అధికారులు అక్కడి ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసీస్ ప్రకటించుకుంది. ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో రెడ్ అలర్డ్ ప్రకటించారు. ఈ దాడుల్లో చాలా వరకు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు తెలుస్తోంది. మొత్తం ఎంత మంది అనేది ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.