జెర్సీ సిటీలో మరోసారి కాల్పుల కలకలం..!

By జ్యోత్స్న  Published on  12 Dec 2019 3:59 AM GMT
జెర్సీ సిటీలో మరోసారి కాల్పుల కలకలం..!

అమెరికాలో మరోసారి కాల్పులు మోత మోగింది. జెర్సీ సిటీలో పోలీసులకు, దుండగులకు మద్య జరిగిన కాల్పులలో ఆరుగురు ప్రాణాలు కోల్సోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులతో పాటు ఒక పోలీసు అదికారి కూడా ఉన్నారు. ఇద్దరు పోలీస్ అదికారులు, ఒక సాధారణ పౌరుడు గాయపడ్డారు. ఓ ట్రక్కులో ఘటనా స్థలికి వచ్చిన దుండగులు కాల్పులు ప్రారంభించడంతో అనేక మంది ఒక షాపులో చిక్కుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు రాగా, పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. కొన్ని గంటలపాటు రెండువైపులా కాల్పులు జరిగాయి. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక పాఠశాలలు, ఇతర దుకాణాలు వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

New Jersey

దుండగులు జరిపిన ఫైరింగ్ లో సిటీ పోలీస్ డిటెక్టివ్ చీఫ్ 39 ఏళ్ళ జోసెఫ్ ‘ జో ‘ సీల్స్ ప్రాణాలు కోల్పోయాడు.ఇతను 2006 నుంచి జెర్సీ సిటీ పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే క్రైమ్ విభాగానికి ప్రమోషన్ పై బదిలీ అయ్యాడని, అక్రమ ఆయుధాల ఆచూకీని కనుగొని, దుండగులను పట్టుకునే బాధ్యతలు నెరవేర్చేవాడని పోలీసులు తెలిపారు.

New Jersey

తొలుత ఈ కాల్పులు ఒక స్మశానం వద్ద ప్రారంభం అయ్యాయి. తరువాత నిందితులు ఒక స్టోర్‌లో దాక్కోవడం తో వారిని వెలుపలికి తీసుకువచ్చేందుకు పోలీసులు చాలాసేపు కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిసింది. నల్లని దుస్తులు ధరించిన క్రిమినల్స్ అత్యంత అధునాతన రైఫిళ్ళతో కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. నిందితులు ఉపయోగించిన ట్రక్ లోనుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. నిందితులు బ్లాక్ హిబ్రు israelites గ్రూప్ లకు సంబంధించిన వారని తెలుస్తోంది...

Next Story