భారత్‌కు తప్పని భంగపాటు.. 1989 తరువాత వైట్‌వాష్
By Newsmeter.Network Published on 11 Feb 2020 10:26 AM GMTకివీస్ దెబ్బకు దెబ్బ తీసింది. టీ20ల్లో వైట్‌వాష్‌కు గురైన ఆజట్టు వన్డేల్లో ప్రతీకారం తీర్చుకుంది. మౌంట్ మాంగనీ వేదికగా జరిగిన మూడో వన్డేల్లో 297 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ జట్టు ఇలా వైట్‌వాష్‌కి గురవడం 1989 తర్వాత ఇదే తొలిసారి.
297 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన కివీస్‌కు ఆ జట్టు ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (66: 46 బంతుల్లో 6x4, 6x6), హెన్రీ నికోలస్ (80: 103 బంతుల్లో 9x4) శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 16.3 ఓవర్లలోనే 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో భారత బౌలర్లు పుంజుకుని వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టాడు. కేన్ విలియమ్సన్ (22), రాస్ టేలర్ (12), జేమ్స్ నీషమ్ (19) వికెట్లని పెవిలియన్‌కు పంపిడంతో కివీస్ 220/5 తో నిలిచింది. అయితే.. ఆ జట్టు ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ (58 నాటౌట్: 28 బంతుల్లో 6x4, 3x6) భారీ షాట్లతో విరుచుకుడి 21 బంతుల్లోనే అర్థశతకాన్ని సాధించాడు. అతనికి టామ్ లాథమ్ (32 నాటౌట్: 34 బంతుల్లో 3x4) సహాకారం అందిచాడు. వీరిద్దరు అభేద్యమైన ఆరో వికెట్‌కు 80 పరుగులు జోడించడంతో.. కివీస్ 47.1 ఓవర్లలో 5వికెట్ల కోల్పోయి 300 చేసి విజయాన్ని అందుకుంది.
అంకముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ పృథ్వీ షా(40; 42బంతుల్లో 3పోర్లు, 2సిక్సర్లు) తో కలిసి శ్రేయస్ అయ్యర్(63 బంతుల్లో 62, 9 ఫోర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నించి షా రనౌటయ్యాడు.
షా ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన లోకేష్ రాహుల్(113 బంతుల్లో 112,9 ఫోర్లు, 2 సిక్సర్లు) .. శ్రేయస్‌తో చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు. దూకుడుగా ఆడుతూ.. ఎడా పెడా బౌండరీలు బాదారు. ఐదో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక అయ్యర్ వెనుదిరిగాడు. ఈ స్థితిలో మనీశ్‌పాండే(42 బంతుల్లో 40,3 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి రాహుల్ భారత్‌కు భారీ స్కోరు అందించే బాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో ధాటిగా ఆడిన వీరిద్దరూ 91 బంతుల్లోనే 107 పరుగులు జోడించారు. కొద్ది సేపటికే.. రాహుల్ వన్డేల్లో నాలుగో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివరిలో స్కోరు పెంచే క్రమంలో వీరిద్దరూ ఔటవడంతో టీమిండియా 300 పరుగుల మార్కును చేరలేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.