రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు… ఆయ‌న ఆరోగ్యం బాలేదు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి, నిపుణులైన వైద్య బృందంతో చికిత్సను అందిస్తున్నారు. అంటూ వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మీడియాలో వ‌స్తున్న వార్త‌లపై కృష్ణంరాజు ప్ర‌తినిధులు స్పందించారు.

కృష్ణంరాజు గారు…చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న‌ వార్తలు కరెక్ట్ కాదు. నిమోనియా వస్తే చెకప్ కోసం కేర్ కు వెళ్లారు. అంతే త‌ప్పా… ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం ఏమీ లేదు అని చెప్పారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.