కివీస్‌ గడ్డ పై అంచనాలను అందుకోవడంతో టీమిండియా విఫలమైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 165 లకే కుప్పకూలింది. అనంతరం న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇప్పటికే కివీస్‌ 51 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో వాట్లింగ్ (14 బ్యాటింగ్), గ్రాండ్‌హోమ్ (4 బ్యాటింగ్) ఉన్నారు.

ఓవర్‌నైట్ స్కోరు 122/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 43 పరుగుల వ్యవధిలోనే మిగిలిన ఐదు వికెట్లనీ చేజార్చుకుంది. భారత్‌ని ఆలౌట్ చేసిన తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు భారత పేసర్‌ ఇషాంత్ శర్మ షాకిచ్చాడు. ఆ జట్టు ఓపెనర్లు టామ్ లాథమ్ (11), బ్లండెల్ (30)ని ఔట్ చేశాడు. దీంతో కివీస్‌ 73 పరుగులకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ దశలో ఆ జట్టు సీనియర్‌ బ్యాట్స్‌మెన్లు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89: 153 బంతుల్లో 11పోర్లు) తో పాటు కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న రాస్ టేలర్ (44: 71 బంతుల్లో 6పోర్లు, 1సిక్స్‌)తో కలిసి కివీస్ ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు.

వీరిద్దరు మూడో వికెట్‌కి 93 పరుగుల జోడించి పరిస్థితిని చక్కదిద్దాడు. విలియమ్సన్‌ని షమీ బుట్టలో వేయగా.. టేలర్‌ని ఇషాంత్ బోల్తా కొట్టించాడు. ఇక ఆఖర్లో హెన్రీ నికోలస్(17)ని అశ్విన్ ఔట్ చేయడంతో.. కివీస్‌ చివరికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 216/5తో ముగించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.