ఆ లెస్బియ‌న్ క్రికెట్ జంట‌కు ఓ పాపట‌..!

By Newsmeter.Network  Published on  17 Jan 2020 8:44 AM GMT
ఆ లెస్బియ‌న్ క్రికెట్ జంట‌కు ఓ పాపట‌..!

న్యూజిలాండ్‌కు చెందిన క్రికెటర్లు ఆమీ సెటర్త్‌వైట్, లియా తహుహు గుర్తున్నారా..? అదేనండి క్రికెట్ చరిత్రలో పెళ్లి చేసుకున్న తొలి లెస్బియన్ జంటగా రికార్డుల‌కు కెక్కారు గ‌దా.. వారే వీరు.. ఇంతకీ విశేషం ఏంటంటే వీరిద‌ద్ద‌రు తాజాగా పేరెంట్స్ గా మారారంట‌. తమ కుటుంబలోకి బేబీ గర్ల్ వచ్చిందని లియా తెలిపింది.

అమీ సెటర్త్‌వైట్-లియా తహుహుకు జంట‌కు కొత్త ఏడాది మరపురానిదిగా మారింది. ఈనెల 13న తమ జీవితంలోకి కొత్తగా పాప వచ్చిందని లియా తెలిపింది. ఈ విషయాన్ని తహుహు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయ‌గా నెటీజ‌న్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పాప పేరు గ్రేస్ మేరీ సాటర్త్‌వైట్‌గా పెట్టామని తహుహు తెలిపింది.

2010లో తహుహుకు సాటర్త్‌వైట్ పరిచయమైంది. 2013లో తమ మధ్య బంధం గురించి వీరిద్దరూ ప్రకటించారు. ఆ తర్వాతి ఏడాదే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. న్యూజిలాండ్‌లో ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) మధ్య జరిగే వివాహాలు చట్టబద్ధమే. ఈక్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్న తొలి లెస్బియన్ జంటగా నిలిచారు. అనంతరం క్రికెట్ ప్రపంచంలో మరికొన్ని జోడీలు వెలుగు చూశాయి. న్యూజిలాండ్ ప్లేయర్ హీలీ జెన్సెన్-నికోలా హాన్‌కాక్, సౌతాఫ్రికా ప్లేయర్ డేన్ వాన్ నీకెర్క్-మారిజాన్నే కాప్ జంట‌లకు లెస్బియన్ వివాహాలు జరిగాయి.

Next Story