న్యూయార్క్ టైమ్స్ మొదటిపేజీ ఇప్పుడెందుకంత సంచలనం?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 May 2020 7:36 AM GMT
న్యూయార్క్ టైమ్స్ మొదటిపేజీ ఇప్పుడెందుకంత సంచలనం?

కరోనా మహమ్మారి అమెరికా మీద తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాలో కరోనా వైరస్ కారణంగా మరణాలు రోజు రోజుకీ అత్యధికమవుతూ ఉన్నాయి. దాదాపు 1,00,000 కి కరోనా మరణాలు చేరుకున్నాయి. వారందరికీ నివాళి అర్పిస్తూ న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక మొదటి పేజీ మొత్తాన్ని కరోనా కారణంగా చనిపోయిన 1000 మంది అమెరికా పౌరుల పేర్లతో నింపింది.

“US deaths near 100,000, an incalculable loss” అంటూ పెట్టిన హెడ్డింగ్.. దాని కింద 'ఇవన్నీ కేవలం పేర్లు మాత్రమే కాదు.. వాళ్లు మనలో ఒకరే' అంటూ మరో సబ్ హెడ్డింగ్ ను ఉంచారు. మొత్తం 1000 మంది చనిపోయిన వారి పేర్లను తరువాతి పేజీలో కూడా ఉంచారు.

కరోనా కారణంగా అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య 97000 పైగా చేరింది. చాలా మంది చావుబ్రతుకుల మధ్య పోరాడుతూ ఉన్నారు. త్వరలోనే 100000 మందికి పైగా మరణించబోతున్నారని.. ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని.. ఎందుకంటే చాలా మంది ఇళ్లల్లోనే చనిపోయారని.. వారి లిస్టును ప్రభుత్వం చేర్చలేదని ఆరోపిస్తూ ఉన్నారు.

మరణాల రేటు ఇంత ఎక్కువగా ఉన్నా కూడా అమెరికా పౌరులలో మార్పు రావడం లేదు. మెమోరియల్ డే కారణంగా అమెరికాలో పెద్ద ఎత్తున అమెరికన్లు బీచ్ లకు పోటెత్తారు. చాలా మంది కనీసం మాస్కులు కూడా లేకుండా కనిపించారు. ఇంత ఎమెర్జెన్సీ ఉన్నా కూడా ప్రెసిడెంట్ ట్రంప్ గోల్ఫ్ ఆడడానికి స్టెర్లింగ్ కు వెళ్లారు. తన సొంత ప్రాపర్టీలో ట్రంప్ గోల్ఫ్ ఆడాడని.. మార్చి తర్వాత ఆయన ఇలా బ్రేక్ తీసుకుని గోల్ఫ్ ఆడడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.

Next Story