లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత సినిమా థియేటర్లలో కొత్త రూల్స్‌..!

By సుభాష్  Published on  16 April 2020 1:07 AM GMT
లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత సినిమా థియేటర్లలో కొత్త రూల్స్‌..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక మన దేశంలో కూడా రోజురోజుకు విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. దీంతో అన్ని వ్యాణిజ్య, వ్యాపార సంస్థలన్నీ మూసి ఉన్నాయి. దీంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. కంటికి కనిపించిన వైరస్‌ వల్ల దేశంతా విలవిలలాడుతోంది. ఇక రెండో దశ లాక్‌డౌన్‌ కూడా అమలవుతోంది.

టాలీవుడ్‌తోపాటు మిగితా ఇండస్ట్రీకు సంబంధించి షూటింగ్‌లు సైతం వాయిదా పడ్డాయి. అలాగే సినిమా థియేటర్లు, మాల్స్‌, మల్టీ ప్లెక్స్‌లు సైతం కరోనా దెబ్బకు మూత పడ్డాయి. ఈనెల 20 నుంచి కొన్ని పరిశ్రమలకు, ఇండస్ట్రీలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు ఇటీవల మోదీ వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ థియేటర్లు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు మాత్రం మే 3 వరకు మూసి ఉండాల్సిందే.

ఇక లాక్‌డౌన్‌ తర్వాతే తెరుచుకుంటాయా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే కరోనా కేసులు తగ్గితే లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశాలుంటాయి. లేదంటే మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలుంటాయి. అందుకే ఎవ్వరు కూడా బయటకు రాకుండా లాక్‌డౌన్‌ కఠినంగా అమలు అయ్యే విధంగా ఉంటేనే కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టి లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారు.

ఇక కరోనా దెబ్బకు సినీ పరిశ్రమలన్నీ కూడా దాదాపు 3 వేలకు కోట్లపైనే నష్టపోతున్నట్లు అంచనా. ఇక టాలీవుకు సుమారు 800కోట్ల మేరకు నష్టాల్లో ఉన్నట్లు అంచనా. ఒక వేళ లాక్‌డౌన్‌ తర్వత కొన్ని నిబంధనలతో థియేటర్లు తెరిచినా.. కరోనా భయంతో ప్రజలు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఎందుకంటే సామాజికి, దూరం, పారిశుధ్యం ఇతర కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక మనదేశంలో సింగిల్‌ స్కీన్‌ థియేటర్లు చాలా ఉన్నాయి. అందులో సరైన సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత మనిషికి, మనిషికి మధ్య మూడు సీట్ల గ్యాస్‌ ఉండే విధంగా సిట్టింగ్‌ సిస్టమ్‌ మారుస్తారని తెలుస్తోంది.

ఇక సింగిల్ స్కీన్‌ థియేటర్ల యజమానులు కేవలం 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాలనే కొత్త నిబంధనలను తీసుకొచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ఇలా సీట్ల సంఖ్య తగ్గించి టికెట్ల రేట్లు పెంచితే మాత్రం మొదటికే మోసం వచ్చేస్తుంది. ఏది ఏమైనా సిని పరిశ్రమకు కరోనా వైరస్‌ పెద్ద తీసిందనే చెప్పాలి.

Next Story
Share it