ప్రెషర్ కుక్కర్ లాభాలనిస్తుందా ?

By రాణి  Published on  24 Jan 2020 12:30 PM GMT
ప్రెషర్ కుక్కర్ లాభాలనిస్తుందా ?

మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమాలను కూడా బాగా ఆదరిస్తోన్న రోజులు ఇవి. మరి అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా ‘ప్రెజర్ కుక్కర్’. మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాలు జాబ్, చదువు, ప్రేమ, పెళ్లి వంటి ప్రధాన విషయాలతో జనం ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే థీమ్ ఆధారంగా ఈ ‘ప్రెజర్ కుక్కర్’ చిత్రం పూర్తి వినోదభరిత చిత్రంగా తెరకెక్కిందట. సుజయ్ - సుశీల్ దర్శకత్వంలో సాయి రోనాక్ - ప్రీతీ ఆష్రాని జంటగా ఫన్నీ టైటిల్ తో పాటు మంచి కాన్సెప్ట్ తో కొత్తగా రాబోతుంది ఈ చిత్రం.

కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఐస్ చేసుకుంది. ఫిబ్రవరి 21న ఈ సినిమా విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది. కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాల పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అన్నపరెడ్డి అప్పిరెడ్డి, సుజోయ్, సుశీల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏపి మరియు తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్ మంచి ఎమౌంట్ కి కొనుగోలు చేసింది. మరి ఈ యూత్ ఫుల్ వినూత్న సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాకైతే అభిషేక్ నామా భారీ మొత్తాన్నే సమర్పించుకున్నాడు. పైగా సినిమా రిలీజుకు ఎప్పుడూ పడనంత ప్రెజర్ ఈ సినిమా కోసం పడ్డాడు అభిషేక్ నామా. మరి ఆ కష్టం ఫలిస్తోందో లేక కష్టాల్లో పడేస్తోందా...చూడాలి.

Next Story